కళాశాల భవనంపై కూలడంతో ఒకరి మృతి
ఢాకా, జులై 21: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన శిక్షణ విమానం ఎఫ్`7 జెట్ ఢాకాలోని ఉత్తర ప్రాంతంలో మైల్ స్టోన్ పాఠశాల, కళాశాల భవనంపై సోమవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు ఉన్నారని మిలటరీ, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు వివరించారు.





