జనగామ జిల్లాలో విషాద ఘటన

– వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన జంట
– యువకుడు క్షేమం..యువతి గల్లంతు

జనగామ,ప్రజాతంత్ర,అక్టోబర్‌ 30: ‌జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మొంథా తుపాన్‌ ‌ప్రభావంతో జిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద దాటికి బైక్‌పై వెళ్తున్న యువతీ, యువకుడు కొట్టుకుపోయారు. హైదరాబాద్‌కు చెందిన బరిగల శివకుమార్‌, ‌వరంగల్‌ ‌జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామానికి చెదిన యువతి శ్రావ్య ఇద్దరు కలిసి బైక్‌ ‌వస్తున్నారు. ఈ క్రమంలో స్టేషన్‌ ‌ఘనపూర్‌ ‌నుంచి జఫర్‌ఘడ్‌ ‌వెళ్లే ప్రధాన రహదారిపై తిమ్మంపేట గొల్ల మత్తడి వద్ద రోడ్డుపై వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. వరదను లెక్క చేయకుండా దాటే ప్రయత్నం చేయగా బైక్‌తో సహా ఇద్దరు కొట్టుకుపోయారు. శివకుమార్‌ ‌చెట్టు కొమ్మను పట్టుకొని సురక్షితంగా బయటపడ్డాడు. యువతి మాత్రం గల్లంతయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు గొల్ల ముత్తడి వద్దకు చేరుకుని 30 మంది ఎస్డిఆర్‌ఎఫ్‌ ‌బృందాలతో గాలిస్తున్నారు. కాగా, యువతి తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ఓ పౌల్టీ ఫామ్‌లో పనిచేస్తూ అమ్మాయిని ప్రైవేట్‌ ‌హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. హనుమకొండలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో శ్రావ్య చదువుతున్నట్లు సమాచారం. బోళ్ల మత్తడి వద్ద డీసీపీ రాజమహేంద్ర నాయక్‌, ఆర్డీవో వెంకన్న, ఏసీపీ నరసయ్య సక్షిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *