ప్యారడైజ్‌ ఎలివేటెడ్‌ ‌కారిడార్‌ ‌పనులు

– 9 నెలల పాటు ట్రాఫిక్‌ ‌మళ్లింపు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌30: ‌ప్యారడైజ్‌ ‌జంక్షన్‌ ‌నుంచి డెయిరీఫామ్‌ ‌రోడ్‌ ‌వరకు జాతీయ రహదారి 44 పై ఎలివేటెడ్‌ ‌కారిడర్‌ ‌నిర్మాణం పనులు ప్రారంభం సందర్భంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నామని జాయింట్‌ ‌కమిషనర్‌ ‌డి. జోయల్‌ ‌డేవిస్‌ ‌తెలిపారు. ఈనెల 30 నుంచి 9 నెలలపాటు ట్రాఫిక్‌ ‌మళ్లింపులు అమలులో ఉంటాయన్నారు. రాజీవ్‌ ‌గాంధీ విగ్రహం జంక్షన్‌ ‌నుండి బాలంరాయ్‌ ‌వరకు రహదారిని మూసివేస్తున్నా మన్నారు. బాలంరాయ్‌ ‌నుంచి సీటీవో జంక్షన్‌కు వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. బాలనగర్‌ ‌వైపు నుంచి పంజాగుట్ట ట్యాంక్‌ ‌బండ్‌ ‌వైపు వెళ్లేవారు తాడ్‌బంద్‌ ‌మస్తాన్‌ ‌కేఫ్‌, ‌డైమండ్‌ ‌పాయింట్‌ ‌కుడివైపు మలుపు తిరిగి మడ్‌ఫోర్ట్, ఎన్‌సీసీ, జేబీఎస్‌, ఎస్‌బీఐ మార్గంలో వెళ్లాలని పేర్కొన్నారు. సుచిత్ర వైపు నుంచి పంజాగుట్ట, ట్యాంక్‌బండ్‌ ‌వైపు వెళ్లే వారు సేఫ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎడమవైపు మలుపు తిరిగి బాపూజీనగర్‌, ‌సెంటర్‌ ‌పాయింట్‌, ‌డైమండ్‌ ‌పాయింట్‌, ‌మడ్‌ఫోర్ట్, ఎన్‌సీసీ, జేబీఎస్‌, ఎస్‌బీఐ మార్గంలో వెళ్లాలని పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌ ‌రాణిగంజ్‌, ‌పంజాగుట్ట, రసూల్‌పురా, ప్లాజా వైపు నుంచి సీటీఓ జంక్షన్‌ ‌ద్వారా తాడ్‌బంద్‌ ‌వైపు వెళ్లేవారు రాజీవ్‌గాంధీ విగ్రహం జంక్షన్‌ ‌నుంచి అన్నానగర్‌, ‌బాలంరాయ్‌, ‌తాడ్‌బంద్‌ ‌ద్వారా పంజాగుట్ట, ట్యాంక్‌ ‌బండ్‌ ‌వైపు వెళ్లేవారు టింగ్‌ ‌పాయింట్‌ ‌బైలేన్‌, ‌హాకీ గ్రౌండ్‌ ‌బైలేన్‌, ‌లా అండ్‌ ఆర్డర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌మార్గాలను ఉపయోగించాలని జాయింట్‌ ‌సీపీ సూచించారు. ట్రాఫిక్‌ ‌సమాచారం కోసం హైదరాబాద్‌ ‌ట్రాఫిక్‌ ‌పోలీస్‌ ‌సోషల్‌ ‌డియా ప్లాట్‌ఫారంలను చూడవచ్చని, ప్రయాణ సమయంలో అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్‌ ‌హెల్ప్‌లైన్‌ ‌నంబర్‌ 9010203626‌కి కాల్‌ ‌చేయవచ్చన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *