- దిల్లీ పర్యటనలో సిఎం రేవంత్‌ను కలిసిన దిల్లీ తెలుగు జర్నలిస్టులు
- తమ సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలపై సిఎంకు కృతజ్ఞతలు
దిల్లీ, సెప్టెంబర్ 12: వ్యవస్థలో జర్నలిస్టులు కీలకమని, బాధ్యతాయుతమైన రిపోర్టింగ్‌కు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు గాను దిల్లీ జర్నలిస్టుల బృందం గురువారం దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంతరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
సీఎంతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాత్రికేయుల ఇండ్లు, హెల్త్ కార్డస్, అక్రిడేషన్ల గురించి చర్చించారు. ముఖ్యంగా మీడియా అకాడమీకి రూ. పదికోట్లు ప్రకటించినందుకు జర్నలిస్టుల ప్రతినిధి బృందం హర్షం వ్యక్తం చేసింది. జర్నలిస్టుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పునరుద్ఘాటించారు. జర్నలిస్టుల సంక్షేమం, భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.





