- – ఇది కె.సి.ఆర్. ఘనతే
- -మాజీ మంత్రి హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 21:స్థానంలో ఉన్న తెలంగాణ, 2024 నాటికి దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఐసీఆర్ఏ ‘స్టేట్ ఎకనామిక్ ట్రెండ్స్ – మే 2025’ నివేదిక వెల్లడించిన సంగతిని ఆయన గుర్తుచేశారు. తలసరి ఆదాయం ₹1.25 లక్షల నుంచి ₹3.5 లక్షలకు రెట్టింపు కాగా, 6.8% సీఏజీఆర్‌తో ఈ పురోగతి సాధ్యమైందంటే అది కేవలం కె.సి.ఆర్. సమర్థ పాలనవల్లనే నని హరీష్‌రావు అన్నారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు, వ్యవసాయ విధానాలు, బలమైన పారిశ్రామిక వృద్ధి ఇందుకు దోహదం చేశాయన్నారు.
కె.సి.ఆర్ తన సమర్థవంతమైన పాలనతో, ధీటైన ఆర్థిక వ్యూహాలతో తెలంగాణను దేశంలో అభివృద్ధి చిహ్నంగా నిలిపారనడానికి ఇది సాక్ష్యమన్నారు. అయినప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని “దివాలా” రాష్ట్రంగా చిత్రీకరిస్తూ రావడం విచారకరమన్నారు. వాస్తవంగా దివాలా అయింది ఆర్థిక వ్యవస్థ కాదు, ఆయన ఆలోచనలే. ఈ విజయాలను విస్మరించి, బీఆర్ఎస్ వేసిన బలమైన పునాదిని కొనసాగించకపోవడమంటే ప్రజలను తప్పుదారి పట్టించడమే కాదు, తెలంగాణ ప్రగతిని అవమానించడమేనన్నారు. బీఆర్ఎస్ పాలన సాధించిన ఈ ఆర్థిక విజయం దేశానికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.



