హైదరాబాద్ మెట్రో రైల్ ను  టేక్ ఓవర్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం   

ఫేజ్‌–2లో ఎల్ ఎన్టీ  ఈక్విటీ భాగస్వామ్యాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సూచించినప్పటికీ, ఎల్ ఎన్టీ  రవాణా కాన్సెషన్ ఆస్తుల యాజమాన్యం వ్యాపారం నుంచి నిష్క్రమించినందున సాధ్యం కాదని సీ ఎం డి  వివరించారు. అయితే, ఫేజ్‌–1లో తమ వాటా మొత్తాన్ని రాష్ట్రానికి బదిలీ చేయడానికి సిద్ధమని తెలిపారు. సమావేశంలో ఆర్థిక అంశాలపై విస్తృత చర్చలు జరిగాయి. చర్చల అనంతరం, రాష్ట్ర ప్రభుత్వం సుమారు ₹13,000 కోట్ల అప్పు బాధ్యతను స్వీకరించి, అదనంగా ₹2,000 కోట్లను ఎల్ ఎన్టీ  ఈక్విటీ సెటిల్మెంట్‌గా చెల్లించి ఫేజ్‌–1 మెట్రోను టేకోవర్‌ చేసేందుకు సూత్రప్రాయ అంగీకారంవ్యక్తమైంది. ప్రజా ప్రయోజనాలను కాపాడుతూ, చట్టబద్ధంగా అన్ని విధానాలు అనుసరించేలా టేకోవర్‌ నిబంధనలు తుది రూపం దాల్చనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *