– ఎస్‌ఐఆర్‌పై సీఈవో సుదర్శన్‌రెడ్డి సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25 : ప్రత్యేక విస్తృత ఓటరు జాబితా సవరణలో భాగంగా చేపట్టాల్సిన అన్ని కార్యక్రమాలు గడువులో పూర్తిచేయాలని, ముఖ్యంగా టేబుల్‌టాప్ వ్యాయామం వంటి పెండిరగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ప్రతి నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ వారీగా పురోగతిని సమీక్షిస్తూ, కచ్చితమైన, లోపరహిత ఓటర్ల జాబితా తయారీపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న ప్రత్యేక విస్తృత ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై సన్నాహాలను ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తదుపరి సమీక్షా సమావేశం నవంబర్ 1న వీడియో కాన్ఫరెన్స్ రూపంలో జరుగుతుందని, అప్పటికి అన్ని పనులు పూర్తవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, ఉప ముఖ్య ఎన్నికల అధికారి హరిసింగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో దిల్లీలో ఇటీవల జరిగిన రెండు రోజుల జాతీయ సమావేశంలో సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నట్లు తెలిసింది. ఆ సమావేశంలో ఎన్నికల జాబితా నిర్వహణలో సాంకేతికత వినియోగం, పారదర్శకత పెంపు, ఓటర్ల సేవల మెరుగుదల, ఉత్తమ పద్ధతుల అమలు వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా, తప్పుల్లేని సమగ్ర ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం ఎన్నికల శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




