- బిసి రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై చర్చ
- కాళేశ్వరం నివేదికపైనా చర్చించే అవకాశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (TG Cabinet Meeting) సచివాలయంలో ఈనెల 25న సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. మరో వైపు పంచాయతీ ఎన్నికల కోసం హైకోర్టు విధించిన గడువు సెప్టెంబరు 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, ఎన్నికలపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశముంది. శనివారం జరగనున్న టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఖరారు కానుంది. రాష్ట్రపతి వద్ద తేలకపోతే పార్టీ పరంగా బీసీలకు 42శాతం సీట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సోమవారం జరగనున్న కేబినెట్ సమావేశంలో పాత రిజర్వేషన్ల ప్రకారం.. ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకొని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచాం పంపించే వీలుంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక అంశంలో హైకోర్టు విచారణపై కూడా చర్చించి.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా నిర్ణయం తీసునే అవకాశం ఉంది. దీనికోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాళేశ్వరం నివేదికపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ఇటీవల హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించగా అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టిన అనంతరం చర్యలు తీసుకుంటామని న్యాయస్థానానికి ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు ఈ భేటీలో తేదీలను ఖరారు చేయనున్నట్టుగా తెలుస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





