‘స్థానిక’ ఎన్నికల్లో పోటీకి మల్లన్న సిద్దం

– పార్టీకి గుర్తు కేటయించాలని హైకోర్టులో పిటిషన్‌
– తగు చర్యలు తీసుకోవాలని ఈసీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌7: తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సన్నద్ధం అవుతోంది. బీసీలకు రాజ్యాధికారం లక్ష్యంగా ఏర్పడ్డ ఈ పార్టీ రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఈ మేరకు పార్టీ వ్యవస్థాపకుడు, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ పార్టీ గుర్తింపు, పార్టీ గుర్తుపై స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు కల్పించాలని పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. పిటిషనర్‌ అభ్యర్థనను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కాగా, రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు, రాజ్యాధికారం లక్ష్యంగా తీన్మార్‌ మల్లన్న సెప్టెంబర్‌ 17న తాజ్‌ కృష్ణ హోటల్‌లో తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. పార్టీ జెండాను ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో రూపొందించారు. జెండా మధ్యలో పిడికిలి బిగించిన చేయితోపాటు కార్మిక చక్రం, వరి కంకులు ఉన్నాయి. జెండాపై భాగంలో ఆత్మగౌరవం, అధికారం, వాటా నినాదాలు రాశారు. పిడికిలి కింది భాగంలో పార్టీ పేరును ముద్రించారు.

——————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *