84 పరుగులతో రాణించిన కోహ్లీ
హైదరాబాద్,ప్రజాతంత్ర, మార్చి 4: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిం డియా దూసుకుపోతోంది. దు బాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో ఆస్ట్రేలియా పై జరిగిన సెమి ఫైనల్స్ లో భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌లోకి ప్రవేశించింది. విరాట్ కోహ్లీ (84), శ్రేయాస్ అయ్యర్ (45) పరుగులతో రాణించి 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. మరోవైపు, ఆస్ట్రేలియా మైదానంలో ఫీల్డింగ్ పేలవంగా సాగింది. రోహిత్ శర్మను రెండు సార్లు కోహ్లీని ఒకసారి క్యాచ్ లను వదిలేశారు.
అంతకుముందు, బ్యాటింగ్ చేసిన ఆసిస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ కారీ (61) అర్ధ సెంచరీలు చేశారు. భారీ లక్ష్యం కోసం ఆస్ట్రేలియా ఎదురు చూసింది, కానీ స్టీవ్ స్మిత్ ను 73 పరుగుల వద్ద మహమ్మద్ షమీ ఔట్ చేయగా, పరుగుల వీరుడు గ్లెన్ మాక్స్వెల్ ను అక్సర్ బోల్డ్ చేసి పెవీలియన్ కు పంపించారు. శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత కారీ 61 పరుగుల వద్ద రనౌట్ చేశారు. . స్టీవ్ స్మిత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత భారతదేశం తరపున షమీ మూడు వికెట్లు పడగొట్టాడు.