– అందుకు అనుగుణంగా పెట్టుబడులకు ప్రోత్సాహం
– మండలిలో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర,జనవరి 6: తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికల్లా 3 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలనే దృఢమైన సంకల్పంతో ముందుకు సాగుతున్నామని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. శాసనమండలిలో ఆయన మాట్లాడారు. పెట్టుబడిదారులకు సులువుగా ఉండే విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానాన్ని తీసుకొచ్చా మన్నారు. తెలంగాణ రైజింగ్ సదస్సులో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఈనెల 19న మరోసారి వరల్డ్ ఎకనమిక్ సమిట్‌కు వెళుతున్నామని, భారీగా పెట్టుబడులు తీసుకొస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. హ్యూసెంట్రియో, సిస్టా ఐటీ సంస్థల ద్వారా వెయ్యి చొప్పున ఉద్యోగాలు వస్తాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జాబ్ క్యాలెండర్ విషయంలో సామాజిక అంశం పరిశీలిస్తూన్నామని అన్నారు. ఉబెర్ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని.. త్వరలో ఏర్పాటు చేస్తుందని, కాగ్నిజెంట్ సంస్థ ద్వారా 5 వేల మందికి ఉద్యోగాలు వొస్తాయని తెలియజేశారు. పోచారం ఇన్ఫోసిస్ సంస్థ విస్తరణ ద్వారా 17 వేల మంది ఉపాధి, విప్రో సంస్థ విస్తరణ ద్వారా మరో 5 వేల మందికి ఉపాధి ఉంటుందని అన్నారు. 70 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని కొనియాడారు. ఇప్పటికే 70 జీసీసీలు రాష్ట్రానికి వచ్చాయని, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ లో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే జినోమ్ వ్యాలీ నాలుగో దశ కూడా పూర్తయిందని, ఐటీ కంటే ఎక్కువగా ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయని అన్నారు. ఏరోస్పేస్, రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





