Tag Today Highlights

బిఆర్‌ఎస్‌ ‌కుట్రలను సహించేది లేదు

Minister Sridhar Babu's warning in a media conference

కలెక్టర్‌పై భౌతిక దాడి దుర్మార్గపు చర్య అభివృద్దిని అడ్డుకోవ‌డ‌మే బిఆర్ఎస్ ల‌క్ష్యం అధికారం పోవడంతో ఉన్మాద చర్యలకు ప్రేరేపణ మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్‌ ‌బాబు హెచ్చరిక : ‌లగచర్ల ఘటన వెనక ఎవరున్నా వొదిలి పెట్టే ప్రసక్తే లేదని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబు హెచ్చరించారు. దీని వెనక బిఆర్‌ఎస్‌ ‌నేతల హస్తం…

Lagacharla Pharma incident బిఆర్‌ఎస్‌ ‌డైరెక్షన్‌లో లగచర్ల ఫార్మా ఘటన!

Lagacharla Pharma incident

దాడిలో బిఆర్‌ఎస్‌ ‌నేత పట్నం నరేందర్‌ ‌రెడ్డి అనుచరుడు ఘటనపై ఆరా తీసిన మంత్రి శ్రీధర్‌ ‌బాబు రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తున్న పోలీసులు ‌ఫార్మా భూసేకరణ సందర్భంగా వికారాబాద్‌ ‌జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్‌, ‌పలువురు అధికారులపై దాడి బిఆర్‌ఎస్‌ ‌కుట్రగా బయటపడుతోంది. దాడిలో పాల్గొన్న వారంతా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లిన‌ట్లు పోలీసులు గుర్తించారు.…

ప్ర‌తి ఒక్క‌రికి స‌మాన అవ‌కాశాలు క‌ల్పించ‌డమే తెలంగాణ మోడ‌ల్‌…

CM Revanth Reddy Interview

కుర్చీ కోసం విభ‌జ‌న రాజ‌కీయాలు దేశానికి మంచిది కాదు.. నేను కేసీఆర్‌కు ఫైనాన్స్ చేశా…. నేను టీఆర్ఎస్‌లో ప‌ని చేయ‌లేదు.. ఇది బీజేపీ ఓట‌మి కాదు.. మోదీ ఓట‌మి. ద ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ అడ్డా కార్య‌క్ర‌మంలో రేవంత్ రెడ్డి…. నేను కేసీఆర్‌కు ఫైనాన్స్ చేశా…. నేను టీఆర్ఎస్‌లో ప‌ని చేయ‌లేదు… తెలంగాణ ఉద్య‌మం సాగుతున్న స‌మ‌యంలో…

Formula E-race scam క‌లెక్ట‌ర్ పై దాడికి ఉసిగొల్పిన‌ వారిని వ‌దిలిపెట్టేది లేదు..

ఎంతటి వారైనా ఊచలు లెక్కపెట్టాల్సిందే గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 12 :  ఫార్ములా ఈ రేసు స్కామ్‌లో గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓ మీడియా ఛానల్‌తో ఆయన మాట్లాడారు. వికారాబాద్ కలెక్టర్‌పై…

ప్ర‌జా విజ‌యోత్స‌వాలకు ఏర్పాట్లు ముమ్మ‌రం..

Arrangements are being made for Praja Vijayotsavam

ఎల్ఈడీ స్క్రీన్లు, షామియానాలు, మెడిక‌ల్ క్యాంపులు, మొబైల్ టాయిలెట్లు, ఎల్బీ స్టేడియంలో అతిథులుకు స‌క‌ల వ‌స‌తులు ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన  ఉన్నతాధికారులు హైదరాబాద్ ఎల్.బి స్టేడియంలో  ఈనెల 14న నుంచి ప్రారంభం కానున్న ప్రజా విజయోత్సవాలకు సంబంధంచిన‌ ఏర్పాట్లను ప్రభుత్వ ఉన్న‌తాధికారులు మంగళ వారం సాయంత్రం పరిశీలించారు. సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ డాక్టర్. ఎస్.హరీష్, ప్రోటోకాల్…

ఉచిత హామీలను తిరస్కరించాలి!

కేంద్రంలో పదేళ్లు దాటినా బిజెపిలో ఇసుమంత్కెనా మార్పుకనిపించడంలేదు. 2 కోట్ల ఉద్యోగాల హామీ గాలిలో, దిల్లీ కాలుష్యంలో కొట్టుకు పోయింది. కేవలం పన్నులు బాదడం తప్ప దానికి మరోటి తెలియడంలేదు. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యం. కాంగ్రెస్‌ కావొచ్చు..బిజెపి కావొచ్చు..తాయిలాలు ప్రకటించి ప్రజలను బురిడీ కొట్టిస్తున్నాయి. ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నాయి. అధికారంలోకి రాగానే తమ స్వలాభమే తప్ప ప్రజల మేలుకోరి పనిచేయడం లేదు. జార్కండ్‌, మహారాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్‌, బిజెపిలు అధికారం కోసం నానాగడ్డీ కరుస్తున్నాయి. జార్కండ్‌ఎ న్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఇండియా కూటమి తన మేనిఫెస్టో విడుదల చేసింది. కూటమి పార్టీలైన జార్కండ్‌ ముక్తిమోర్చా (జెఎంఎం), కాంగ్రెస్‌, ఆర్జేడీ, సీపీఎం ఉమ్మడిగా ఏడుగ్యారంటీలతో ఈ మేనిఫెస్టోను ప్రకటించాయి. పదిలక్షలమంది యువతకు ఉపాధి, పదిహేను లక్షల రూపాయలవరకూ ఆరోగ్యబీమా, నాలుగువందల యాభై రూపాయలకే సిలండర్‌, మహిళలకు నెలకు రెండున్నరవేల రూపాయలు, ప్రతివ్యక్తికీ ఏడుకేజీల ఆహారధాన్యాలు, వరి కనీసమద్దతుధరను ఎనిమిది వందల రూపాయలు పెంచడం, వెనుకబడిన తరగతులవారికి ప్రత్యేక కమిషన్‌, మైనారిటీల హక్కుల పరిరక్షణ ఇందులో ఉన్నాయి. ఈ హామీలన్నీ ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కొనసాగించివుంటే నమ్మకం ఉండేది. కానీ బిజెపి, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలకే దిక్కులేదు. ఆదివాసుల వో ట్లకోసం బీజేపీ ఎంతగా కష్టపడుతోంది. ఇటీవలి ఎన్నికల సభలో మోదీ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇది తెలియచెబుతాయి. ప్రధానంగా బంగ్లాదేశీ అక్రమ వలసదారులు జార్కండ్‌ మూలమూలల్లోకి చొరబడ్డారని, వారికి దొంగసర్టిఫికేట్లు ఇచ్చి స్థిరపరచడం ద్వారా ఇండియా కూటమిలోని పార్టీలు అతిపెద్ద వోటుబ్యాంకును తయారుచేసుకున్నాయని ఆరోపిస్తూ సెంటిమెంట్‌ ప్రయోగిస్తున్నారు. ఆ చొరబాటుదారులు గిరిజన ఆడబిడ్డల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, విద్యాసంస్థలకు మైనారిటీ గుర్తింపుతో ఆదివాసీ విద్యార్థులకు జెఎంఎం ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని బీజేపీ విమర్శలు చేస్తోంది. సంథాల్‌ పరగణాస్‌లో పెద్దసంఖ్యలో అక్రమ చొరబాటుదారులు స్థిరపడ్డారంటూ జార్కండ్‌ హైకోర్టులో ఒక పిల్‌ దాఖలు కావడం, దానిపై మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతూండటం ఎన్నికల్లో బిజెపి వాడుకుంటోంది. గత ఎన్నికల్లో బీజేపీ కంటే ఓ ఐదుసీట్లు ఎక్కువ తెచ్చుకున్న జెఎంఎం, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రతీ చిన్న ఎన్నికనూ తీవ్రంగా తీసుకొనే బీజేపీ ఈ మారు జార్కండ్‌ ను స్వాధీనం చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. బీజేపీ ఇప్పటికే విడుదల చేసిన మేనిఫెస్టోలో, తాను అధికారంలోకి రాగానే 2.87లక్షల ప్రభుత్వోద్యోగాలను భర్తీచేస్తానని, నెలకు రెండువేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇవ్వడంతోపాటు, మహిళలకు వివిధ పథకాలద్వారా దండిగానే ఆర్థిక సాయం ప్రకటించింది. పదేళ్ళక్రితం బీజేపీ ఆదివాసీయేతరులను, ప్రధానంగా ఓబీసీలను దగ్గరకు చేర్చుకొని జార్కండ్లో అధికారంలోకి రాగలిగింది. ఆ ఎన్నికల్లో మోదీ హవా ఉధృతంగా ఉన్నందువల్ల కూడా ఆ ఎత్తుగడ సులువుగా పనిచేసింది. కాని ఇప్పుడా పరిస్థితి లేదు. ఎందుకంటే బిజెపి పాలన ఎలావుందో గత పదేళ్లుగా ప్రజలు అనుభవిస్తున్నారు. అధికారంలోకి రావడం కోసం కర్ణాటక, తెలంగాణలో ఇష్టారీతిన ఇచ్చిన గ్యారెంటీలు, హామీలు, ప్రకటించిన పథకాలు అమలు చేయలేక, చేయలేమని ప్రజలకు చెప్పలేకపోతున్న తీరును ప్రజలు చూస్తున్నారు. మహారాష్ట్ర, జార్కండ్‌ ఎన్నికలకు ముందు ఈ రకమైన హామీలు గుప్పించినా ప్రజలు ఇరుపార్టీలను నమ్మేంతగా పరిస్థితులు లేవు. ఎన్నికల సమయంలో అలవికాని హామీలిచ్చి ఏదోరకంగా ఆయా రాష్ట్రాల్లో అధికారం దక్కించుకునేందుకు బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు ఎత్తుగడలు వేస్తున్నాయి. చాంతాడంత లిస్టుతో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తరవాత హామేలు అమలు చేయలేక చతికిలపడడం అలవాటు చేసుకున్నారు. ఐదేళ్ల తరువాత మళ్లీ కొత్తగా హామీలు ఇవ్వడానికి వెనకాడడంలేదు. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఇచ్చిన హామీలు అమలుచేయలేని అసహాయతను బయటపెడుతున్నారు. దున్నపోతు మీద వాన పడినట్టు పట్టించుకోనట్టు నటించడం కూడా అలవాటు చేసుకున్నారు. మ్యానిఫెస్టోలో హామీలు గుప్పించడం మాత్రంమానడంలేదు. బీజేపీ పరిస్థితి కూడా కాంగ్రెస్‌కు భిన్నంగా ఏమీ లేదు. ఉచితాల గురించి అభ్యంతరాలు వ్యక్తం చేసే మోదీ బృందం కూడా వాటి బాటే పట్టింది. ప్రతీ మహిళకు రూ.2,100 ఇస్తామని జార్కండ్‌ లో చెప్పిన బీజేపీ, నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పింది. మహారాష్ట్రలోనూ ఇదే అంశంపై బీజేపీ ఆధారపడ్డట్టు కన్పించింది. ముఖ్యమంత్రి లడ్కీ బచావ్‌ పేరుతో మహిళలకు ప్రతీ నెల రూ.1500 హామీ ఇచ్చి, ఇప్పటికే పాక్షికంగా అమలుచేస్తున్నారు. గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ హామీ మామూలే. ఉచితాలు, హామీల విషయంలో ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ కూటములు కూడా తక్కువేం తినలేదు. ఒకడుగు ముందుకేసి మహారాష్ట్రలో ప్రతి మహిళకు నెలకు రూ.2 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ, కర్ణాటక అనుభవాలతో కాంగ్రెస్‌ హామీలకన్నా, అధికారమే మిన్న అన్న ధోరణిలో సాగుతోంది. గత హామీల అమలుకు దిక్కు లేకున్నా, కొత్త హామీలు, పథకాలు ప్రకటిస్తే ప్రజలు వోట్లేస్తారులే అన్న ధీమాలో కాంగ్రెస్‌, బీజేపీలు ఉన్నట్లుగా కనపడుతున్నది. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఏ విషయంలో విభేదాలున్నా ప్రజలకిచ్చే హామీల విషయంలో ఈ రెండు పార్టీల వ్యవహారశైలి ఒక్కటే అన్నట్టుగా ఉన్నది. ప్రజల నిజమైన అవసరాలపై వాటికి పట్టింపులేదు. ఇచ్చిన హామీలు తప్పనిసరిగా నెరవేర్చాలనే బాధ్యత లేదు. అధికారమే పరమావధి అన్నట్టుగా వీరి కార్యాచరణ ఉంది. అందుకే ప్రజలు ఎప్పటికప్పుడు చైతన్యం కావాలి. మిగతా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా లేదా తెలుసుకోవాలి. అలాగే ఉచిత హామీలను తిరస్కరించాలి. అప్పుడే నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తారని గుర్తించాలి. జార్కండ్‌లో ఉత్కంఠపోరు.. గెలిచేదెవరో ...!? జార్కండ్‌ లో ఉన్నవి 81 సీట్లే. అక్కడ రెండువిడతల్లో ఈనెల 13, 20 తేదీల్లో పోలింగ్‌ జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించుకుంది. దీంతో ప్రచారహోరు సాగుతోంది. ఆదివాసులను విస్మరించినందునే అధికారాన్ని చేజార్చుకున్నానని బీజేపీ నమ్ముతున్నందున ఈ మారు వారి వోట్లను సైతం అధికంగా కొల్లగొట్టేందుకు విశేషమైన ప్రయత్నం చేస్తోంది. జార్కండ్‌ లో ఉమ్మడి పౌరస్మృతి (యూసిసి)ని అమలు చేస్తానని ప్రకటించిన ఆ పార్టీ దానినుంచి ఆదివాసులను మాత్రం మినహాయించింది. ఇందుకు పూర్తిభిన్నంగా జెఎంఎం ఆదివాసులకు 1932 నాటి ఖతియాన్‌ విధానం ఆధారంగా సర్వమత నియమావళి ని అమలుచేసి ఒక ప్రత్యేక ఆదివాసీ మత గుర్తింపునకు హామీ పడుతోంది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఐదు ఎస్టీ రిజర్వుడు సీట్లనూ ఇండియా బ్లాక్‌ గెలుచుకున్న విషయం తెలిసిందే. జెఎంఎం-కాంగ్రెస్‌ కూటమి ఏలుబడిలో అన్ని రకాలుగా అన్యాయమైపోయిన ఆదివాసుల ప్రయోజనాలను పరిరక్షించేది తానేనని బీజేపీ చెబుతోంది. ఇక భూకుంభకోణంలో హేమంత్‌ సొరేన్‌ అరెస్టు, సుప్రీంచొరవతో విడుదల కావడం, హేమంత్‌ భార్య కల్పనా సొరేన్‌ తెరవిరీదకు రావడం ఇత్యాది పరిణామాలు నిజానికి జెఎంఎంకు కొత్తశక్తిని ఇచ్చాయి. మహిళా వోటర్లను ఆమె బలంగా ఆకర్షించగలుగుతున్నదని అంటారు. అయితే, ఓబీసీలు, ఎగువకులాల వోట్లు అధికంగా బీజేపీపక్షాన ఉన్నందున ఇండియా కూటమిని ఆదుకోవాల్సింది ప్రధానంగా రాష్ట్ర జనాభాలో దాదాపు 27శాతంగా ఉన్న ఆదివాసులే. హేమంత్‌ సొరేన్‌ మీద కేసులు, అనంతరం చంపయ్‌ సొరేన్‌ బీజేపీలో చేరడం ఇత్యాది పరిణామాల మీద జార్కండ్‌ వాసులు ఏ తీర్పు ఇచ్చారో నవంబరు 23న తేలుతుంది. వెయిట్‌ అండ్‌ సీ.. -కందుల శ్రీనివాస్‌ సీనియర్‌ జర్నలిస్ట్‌ సెల్‌: 98484 43599

హామీలకన్నా, అధికారమే మిన్న  ఇచ్చిన హామీలకే దిక్కులేదు.. మళ్లీ హామీలు ఉచితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసే మోదీ బృందం కూడా వాటి బాటే పట్టింది… కేంద్రంలో పదేళ్లు దాటినా బిజెపిలో ఇసుమంత్కెనా  మార్పుకనిపించడంలేదు.  2 కోట్ల ఉద్యోగాల హామీ గాలిలో, దిల్లీ కాలుష్యంలో కొట్టుకు పోయింది. కేవలం పన్నులు బాదడం తప్ప దానికి మరోటి తెలియడంలేదు.…

అన్యాయాన్ని ఎదిరించిన ధిక్కార స్వరం కాళోజీ

‘‘తెలుగు బిడ్డవు రోరి తెలుగు మాట్లాడుటకు సంకోచ పడియెధవు సంగతేమిటిరా? అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధృడ!   చావవేటికిరా. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. ప్రముఖ కవి, రచయిత మాటల మాంత్రికుడు ధిక్కార స్వరాన్ని  వినిపించి, అందరి గొడవను తన గొడవగా భావించిన అక్షర యోధుడు మన కాళోజీ నారాయణ…

కుల గ‌ణ‌న‌పై దొంగల మాటలను నమ్మొద్దు..

Nayini Rajendar Reddy

బిఆర్ఎస్ చేప‌ట్టిన సమగ్ర సర్వే వివరాల‌ను ఎందుకు దాచారు? ఈనెల 19 తర్వాత కొత్త వరంగల్ చూడబోతున్నాం… వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, నవంబ‌ర్ 10 :  కుల‌గ‌ణ‌న‌పై ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా కొంద‌రు దొంగ‌లు చెబుతున్న మాట‌ల‌ను ఎవ‌రూ న‌మ్మొద్ద‌ని వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి…

బీసీ డిక్లరేషన్ పేరుతో బలహీన వర్గాలకు వెన్నుపోటు

KTR

పొంగులేటికి బాంబుల మంత్రిత్వ శాఖ ఇవ్వాలి హనుమకొండలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హనుమకొండ, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 10 : బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆదివారం కేటీఆర్ హనుమకొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో…