వియత్నాం నుంచి తిరుగు ప్రయాణం

“ఇలాంటి గెరిల్లా యుద్ధ పద్ధతులు అక్కడ చాలా ఉన్నాయి. అందువల్లనే అమెరికా సైనికులు భారీగా మరణించారు. ఫలితంగా అమెరికా లాంటి అగ్రరాజ్యం యుద్ధం విరమించినట్లు ప్రకటించింది. అప్పటినుంచి ఉండిపోయిన అమెరికన్లు, ఆ ప్రదేశంలో జరుగుతున్నంత సేపు వియత్నా మీస్ యుద్ధ నైపుణ్యానికి ఆశ్చర్య పోయాను. పలు యుద్ధాలను ఎదుర్కొని 1975లో స్వతంత్రాన్ని పొందిన వియత్నాం అతి కొద్ది సమయంలోనే వాళ్ళు సాధించిన సాంకేతిక, సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఫిదా అయ్యాను. శ్రమపట్ల వాళ్ళకున్న గౌరవం, క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే తత్వం వాళ్ళను ఈనాడు ముందంజలో ఉంచింది. ప్రస్తుతం అమెరికా వియత్నాం మిత్రదేశాలు.” గిరియానం – 1 హోచిమన్ నగరం వియత్నాం దేశానికి రాజధాని. దక్షిణ వియత్నాంలో ఉంది. వాతావరణం వెచ్చగా ఉంటుంది. పూర్వం ఈ నగరాన్ని సైగాన్ అని పిలిచేవాళ్ళు. సైగాన్ నదీ తీరంలో ఉండడం వల్ల ఆ పేరు వచ్చి ఉంటుంది. తరువాత కమ్యూనిష్టు నాయకుడు హోచిమన్ మీద గౌరవంతో ఆ పేరు స్థిరపడింది. ఈ నగర జనాభా 14 మిలియన్లు. ఆర్థిక, సాంస్కృతిక కేంద్రం. హోచిమన్ అసలు పేరు న్గుయెన్ సీన్ కుంగ్. మే 19 తేదీన 1890 సంవత్సరంలో జన్మించాడు. సుమారు ఇరవై యేళ్ళ వయసులో దేశం విడిచిపెట్టి వెళ్ళి ‘ వియత్ మిన్ ‘ అనే సంస్థను స్థాపిం చాడు. ఫ్రాన్స్ , అమెరికా యుద్ధాలలో వియత్నాం విముక్తి కొరకు గెరిల్లా యుద్ధ పద్ధతుల్లో పోరాటం చేసాడు. ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం అని రెండు భాగాలుగా ఉన్న వియత్నాంను ఏకం చేయాలని ఆయన ఆశయం. 1945 నుంచి 1969 దాకా ఉత్తర వియత్నాం అధ్యక్షుడుగా పనిచేసాడు. 1969లో మరణించాడు. ఆయన మరణించిన తర్వాతనే ఉత్తర దక్షిణ వియత్నాంలు 1975లో ఒకే దేశంగా రూపొందింది. ఈ విషయాలు గైడ్ చెర్రీ చెపుతున్నప్పుడు నాకు ప్రొ. జయశంకర్ గుర్తుకు వచ్చాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు కలగన్న ఆయన మరణించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తొమ్మిది మంది బృందంలో నేను, పద్మ, అనురాధ వియత్నాం వార్ మ్యూజియం చూడడానికి వెళ్ళాం. ఈ మ్యూజియం ను 1975 లో ప్రారంభించారు. ఇది అమెరికా వియత్నాం యుద్ధానికి సజీవ సాక్ష్యం. బయటి ప్రాంగణంలో ఆ యుద్ధంలో ఉపయోగించిన ట్యాంకర్లు, విమానాలు ఉన్నాయి. వార్ మ్యూజియం…








