వాల్మీకి బోయలపై వివక్ష ఇంక ఎన్నాళ్ళు..?
పల్లకి ఎక్కిన ప్రభువు కాదోయ్ అది మోసిన బోయిలెవరు అంటూ ఓ మహాకవి ఓ సందర్భాన శ్రామిక కులాల ఉత్పత్తి విలువను వాళ్ల వెట్టి విధానాన్ని రాసుకొచ్చాడు.ఈ దేశానికే ఆదర్శమని కథలు కథలుగా చెప్పుకునే రాముని చరిత్రను రాసిన వాల్మీకి రుషి వారసులుగా, రాజులకు రాజ్యాలకు రక్షణ కోటలుగా తమ శరీర బలాలను అందించిన జాతి…
