Tag personal growth

సంసిద్ధత-లక్ష్మీ కందిమళ్ళ

దుర్మార్గం తన అడుగులను గర్జనలతో వినిపిస్తుంది. చేతుల్లోని అధికారాన్ని శాశ్వతమని భావిస్తుంది. తన నీడనే ప్రపంచమంతా కమ్మేస్తుందని అహంకరిస్తుంది. కానీ అది చూడలేని ఒక మహాశక్తి ఉంది. అదే ప్రకృతి. ప్రకృతి ఎప్పుడూ తొందరపడదు. ఎందుకంటే కాలం తన శ్వాస. ఋతువులు తన అడుగులు. సూర్యోదయం తన చిరునవ్వు. సంధ్య తన ధ్యానం. నక్షత్రాలు తన కళ్లలో…

జీవితమే నన్ను పుటం పెట్టింది

(02 ఆగస్టు 2026 న చాసో కథా పురస్కారం అందుకుంటున్న సందర్భంగా) నకజనకరి నాం.. నాం…’ సంపుటిలోని కథల నేపథ్యం? ‘నకజనకరి నాం.. నాం…’ సంపుటి గ్రామీణ దళిత స్త్రీల జీవనసత్యాల నుంచి పుట్టిన కథల సమాహారం. వలస జీవితం, ఆకలి, శ్రమ, సంప్రదాయాలు, అమాయకత్వం, మారుతున్నకాలం మధ్య గ్రామీణ ప్రజల అస్తిత్వ పోరాటమే ఈ…

తీసివేతే కూడిక

మెరుపు తీగెలు -బమ్మిడి జగదీశ్వరరావు “ఇంతకీ సినిమా యెలా వుందంటావ్? హిట్టా ఫట్టా?” “హిట్టా ఫట్టాతో యేమి సంబంధం? బాక్సాఫీస్ కలెక్షన్స్ బాగుంటే సరి!” “మంచి కథేనట కదా? హీరో బాగా కష్టపడ్డాడట కూడా?” “ఈ మధ్య సినిమాలన్నీ హీరో ఎలివేషన్ల కిందపడే చచ్చిపోతున్నాయి…” “హీరో ఎలివేషన్ సరే, హీరోయినుకు ఎలివేషన్స్ యేముంటాయి?” “బాడీ ఎగ్జిబిట్…

మెరుగైన నైపుణ్యమే అసలైన సంపద

 ” ఉద్యోగాల స్వరూపం, వాటికి కావాల్సిన నైపుణ్యాలు వేగంగా మారుతున్నాయి. కాబట్టి, మనం కూడా మన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండాలి. ఈ మార్పులకు అనుగుణంగా పరిశ్రమలు, పరిశోధన సంస్థలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు కాలానుగుణంగా తమను తాము నవీకరించుకోవడం అత్యవసరం..”   కాలం ఎంత వేగంగా మారుతోందో మీకు తెలుసు. ఒక నైపుణ్యాన్ని నేర్చుకుని అది జీవితాంతం సరిపోతుందనే…

అవరోధాలు దాటి… ఆత్మవిశ్వాసంతో ముందుకు

సమాజంలో ప్రతి వ్యక్తీ గౌరవంగా జీవించే హక్కును కలిగి ఉంటారు. అయితే శారీరకంగా లేదా మానసికంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్న వారిని మనం గతంలో ‘వికలాంగులు’ అని పిలిచేవాళ్ళం. కానీ వారిలో దాగి ఉన్న అంతర్గత శక్తిని, ప్రత్యేక ప్రతిభను గుర్తించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారిని ‘దివ్యాంగులు’ అని సంబోధించడం ఒక సామాజిక మార్పుకు…