సామాజిక తెలంగాణ సాధన కోసం పోరాటం

– విప్ల‌వాత్మ‌క ఆలోచ‌న‌తోనే ఇది సాధ్యం
– పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలి
– జాగృతి వ్య‌వ‌స్థాప‌కురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌

మహబూబ్ న‌గ‌ర్‌,  ప్రజాతంత్ర, అక్టోబర్ 29: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా అభివృద్ధిలో ఇంకా వెనుక‌బ‌డే వున్నందున‌ సామాజిక తెలంగాణ సాధన కోసం జాగృతి జనం బాట కార్యక్రమం చేపట్టామని జాగృతి వ్యవస్థాపకురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌ చెప్పారు. మహబూబ్ న‌గ‌ర్‌ జిల్లా కేంద్రంలో బుధ‌వారం  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. విప్ల‌వాత్మ‌క ఆలోచ‌న‌తోనే సామాజిక తెలంగాణ సాధ్య‌మ‌న్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తికి చివరి దశలో ఉందని, అది పూర్తి చేస్తే ఎక్కడ మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్‌కు పేరు వస్తుందోన‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆ ప‌ని చెయ్యడం లేద‌ని ఆరోపించారు. పాల‌మూరు బిడ్డ‌న‌ని చెప్పుకునే రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ టౌన్ కు రెండు సంవత్సరాల్లో ఎన్నిసార్లు వచ్చార‌ని ప్ర‌శ్నించారు. కనీసం మహబూబ్ న‌గ‌ర్‌ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తేవాలనే ఆలోచన ఉందా లేదా అని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీ‌నివాస రెడ్డి కాంగ్రెస్‌లో వున్నాడా లేక బీజేపీలోనా అని ప్ర‌శ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేయాల‌ని ముఖ్యమంత్రికి విజ్ఞ‌ప్తి చేస్తున్నాన‌న్నారు. తాము తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ (టీజేటీఎఫ్‌) ను ప్రారంభించాం.. దాంట్లో పాలమూరు జిల్లాకు సంబంధించిన ఉపాధ్యాయ మిత్రులు చేరాల‌ని పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి ఒక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్.. ఆ విధంగానే ఉద్యమంలో  పనిచేస్తున్నాం.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే మా ప్రాధాన్య‌త అన్నారు.  రానున్న రోజుట్లో జాగృతిని మ‌రింత బ‌లోపేతం చేస్తామ‌ని క‌విత‌ చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *