తుఫాను బాధిత కుటుంబాలను ఆదుకోండి

– కార్పొరేట్‌ సంస్థలకు మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: మొంథా తుఫానుతోపాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ఆపన్న హస్తం అందించాల్సిందిగా పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. ముఖ్యంగా భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లోని పౌరులు, రైతుల కోసం సహాయ, పునరావాస శిబిరాలు నిర్వహించాలని పలు సంస్థలకు లేఖలు రాశారు. సామాజిక బాధ్యతగా నిత్యావసర వస్తువులు, ఔషధాలు, వైద్య సహాయం అందించాని శ్రీధర్‌బాబు కోరారు. ఆపత్కాలంలో వారికి అండగా నిలిచి చితికిన కుటుంబాలను తిరిగి నిలబెట్టాలన్నారు. పొలాల్లోని పంటలు వరదలకు దెబ్బతిన్నాయని, మార్కెట్లకు తరలించిన ధాన్యం, మక్కలు వాన నీటిలో తడిసాయని వెల్లడిరచారు. ప్రభుత్వం అందించే సాయంతోపాటు ప్రైవేటు సంస్థల కూడా తమవంతు సహకారం అందిస్తే అకాల వర్షాలతో నష్టపోయిన వారు త్వరగా కోలుకుంటారని శ్రీధర్‌బాబు అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *