– జూబ్లీహిల్స్ ఓటర్లకు మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: బీఆర్‌ఎస్, బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దని జూబ్లీహిల్స్ ఓటర్లను ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా శ్రీనగర్ కాలనీలోని జీహెచ్‌ఎంసీ పార్కులో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, గిరిజన శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మక్కన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, ఇతర ముఖ్య నేతలతో కలిసి మంగళవారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్ మహా నగరాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. రాబోయే రోజుల్లో నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి అమలు చేయబోయే భవిష్యత్తు ప్రణాళికల గురించి కూడా వివరించారు. అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఆదరించి నిరంతరం జూబ్లీహిల్స్ ఓటర్లకు అందుబాటులో ఉండే నవీన్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




