ఆధ్యాత్మిక శోభ మూఢ విశ్వాసాలతో తెల్లారుతున్న బతుకులు

“తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. కార్తీకమాసంలో  దేవాలయాలకు క్యూ కడుతున్నారు. కొందరు అయ్యప్ప మాల ధరిస్తున్నారు, ఇంకొందరు అరుణాచలం గిరిప్రదిక్షణ వెళ్లేందుకు సిద్దపడుతున్నారు. చిన్న దేవాలయాల్లో గుండాట,పేకాట, క్యాబరే డాన్స్, జూదం పెచ్చరిల్లి పోయాయి. వెర్రి పుంతలు తొక్కుతున్న ఈ ప్రక్రియ ఏ సంప్రదాయం.. ఏ సనాతనము అర్థం కావడం లేదు.”
కొయ్య బొమ్మలు  మెచ్చు కళ్ళకు కొమలులు సారమెక్కునా  అంటారు గుర్రం జాషువా.  వాట్సాప్ సోషియల్ మీడియాలో పనికిమాలిన ప్రచారంతో  దేవుళ్లను బజారుకు ఈడుస్తూ, నకిలీ కట్టడాలను సృష్టించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒకవైపు పుష్కరాలు  కుంభమేలా   దేవాలయాల పేరుతో లక్షల కోట్లు వెచ్చించి అజ్ఞానాన్ని  మూఢభక్తి ని అవివేకాన్ని పెంచి పోషిస్తున్న కేంద్ర  ప్రభుత్వం మరోవైపు  ఆంధ్ర లో ఉన్న అన్ని దేవాలయాలకు రాబోయే రెండు సంవత్సరాలలో ఆధ్యాత్మిక శోభ తెస్తామని  ప్రకటించిన ముఖ్యమంత్రి, తల్లికి తిండి పెట్టలేదు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు కొనిచ్చినట్లు ఉంది. దేవుని సన్నిధిలో రక్షణ కరువైతొక్కిసలాటలో ప్రాణాలొదుతున్నారు.  ప్రాచీన దేవాలయాలల్లో ధూప దీప నైవేద్యాలకు నయా పైసా విదల్చని ప్రభుత్వం, పనికిమాలిన  పనులకు కోట్లు విడుదల చేస్తున్నారు. చారిత్రక కట్టడాలు పరిరక్షించాల్సిన  ప్రభుత్వం కార్తీక శోభ, దీపోత్సవం  పేరుతో ప్రైవేటు కార్యక్రమాలకు  పనికిమాలిన ప్రచారాలకు  పెద్ద ఎత్తున ప్రచారం  విస్తుకోల్పిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో  ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. కార్తీకమాసంలో  దేవాలయాలకు క్యూ కడుతున్నారు. కొందరు అయ్యప్ప మాల ధరిస్తున్నారు, ఇంకొందరు అరుణాచలం గిరిప్రదిక్షణ  వెళ్లేందుకు సిద్దపడుతున్నారు. చిన్న దేవాలయాల్లో గుండాట, పేకాట, క్యాబరే డాన్స్, జూదం పెచ్చరిల్లి పోయాయి.  వెర్రి పుంతలు తొక్కుతున్న  ఈ ప్రక్రియ  ఏ సంప్రదాయం  ఏ సనాతనము అర్థం కావడం లేదు. మరో వైపు కొత్త సినిమాలు  ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పెట్టి జనాన్ని  తొలి సినిమా టికెట్లు  పెంచుకొని  సినిమా  అంటే  సిగ్గు నీతి మానం లేనిది  అని  కొత్త అర్థం చెబుతున్న హీరోలు. ఒకవైపు  హింస, అస్లీలత, అనైతికత, విచ్చలివిడితనం, తాగుడు పెంచి పోషించే సినిమాలను ప్రోత్సహిస్తూ మరో వైపు  విద్యార్థులలో నైతికత నైపుణ్యత  పెంపొందించడానికి క్యాబినెట్ హోదా కలిగిన  ప్రవచన కర్తలను సలహాదారులుగా నియమించారు.
మొదటిరోజే సినిమా చూసేయాలి,  పండగ రోజు దర్శనం చేసుకోవాలి,  పుష్కరాలప్పుడే గోదాట్లో మునగాలి,  పున్నమి రోజు ప్రదక్షిణ చేయాలి, మాల్ ఓపెనింగ్ రోజు కొనాలి, రెస్టారెంట్ మొదటిరోజే టేస్ట్ చేయాలి.ఈ మూర్ఖత్వమే కదా ప్రమాదాలకు కారణం.  మన ప్రాణాల కన్నా ఏది ముఖ్యం కాదు. మన కోసం మన కుటుంబం ఉంది. కుటుంబం లో ఒకరు లేక పోతే ఆ లోటు పిల్లలపై ఎంత ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోండి. మనల్ని ప్రేమించే అభిమానించే వాళ్ళ కన్నా హీరోలు దేవుళ్ళు లేరు. పోయాక ఏడ్చడానికి, శవం ఎత్తడానికి దేవుడు గానీ హీరోగానీ రారు.
కాశీ బుగ్గ  వేంకటేశ్వరస్వామి గుడి  తొక్కిసలాటలో పది మంది  భక్తులు చనిపోయారు. కార్తీక  ఏకాదశి నాడు వేల  సంఖ్యలో జనం గుడికి  వస్తారన్న అంచనాలు ఉన్నప్పటికీ దానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై స్పష్టత లోపించడం వైఫల్యంగా కనిపిస్తున్నది. నివాస ప్రాంతాల్లో సన్నని ఇరుకు దారులలో వీటిని ఏర్పాటు చేయడం, మలమూత్ర విసర్జనకు కూడా అవకాశం లేకుండా ఉండటం, ఆఖరుకు ఆహారం, మంచినీరు వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి గంటల తరబడి వేచి ఉండటం అడుగడుగునా కనిపించింది.
గుడి పరిసర ప్రాంతాల్లో భక్తులను నియంత్రించడానికి, క్రమబద్ధీకరించడానికి పోలీసులు లేకపోవడం ఈ దుస్థితి కారణంగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఎన్నో  ప్రాణాలు గాలిలో కలిసిన, ఎందరో క్షతగాత్రులైన  తరువాత  ఇప్పుడు మనం చింతించడం తప్ప చెసెది ఏమి లేదు  అని నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేసిన, గత సంవత్సరం  కుంభమేలా  లో ఎంతోమంది చనిపోయారు, రైల్వే స్టేషన్లో  అసువులు బాసిన అమాయకులెందరో,  బాబా గారి  పాదాల కింద భూమిని  తాకడానికి  117 మంది బలైపోయారు,  ఏది  ఏమైనా  ప్రజలు  జాగరూకత  అవసరం. తొక్కిసలాటల్లో విలువైన ప్రాణాలు తీసుకోకండి.  సంయమనం పాటిస్తే అందరికీ మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *