సీజనల్‌ వ్యాధుల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి

– వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30: రాష్ట్రంలో ప్రజారోగ్య శాఖ ముందస్తు నివారణ చర్యలు చేపట్టడం వల్ల సీజనల్‌ వ్యాధుల కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు డైరెక్టర్‌ అఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ రవీందర్‌ కుమార్‌ వెల్లడిరచారు. సీజనల్‌ వ్యాధులు పూర్తి నియంత్రణలో ఉన్నాయని అధికారులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వివరించారు. హైదరాబాద్‌లోని రాజీవ్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో సీజనల్‌ వ్యాధుల నివారణపై మంగళవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో సీజనల్‌ వ్యాధుల నివారణపై ఏర్పాటు చేసిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను మంత్రి పరిశీలించారు. సీజనల్‌ కేసుల నమోదు రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని ఆదేశించారు. సీజనల్‌ వ్యాధుల కట్టడిపై మంత్రి రాజనర్సింహ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల్లో అవగాహనను కల్పించామని అధికారులు వెల్లడిరచారు. రాష్ట్రంలో అన్ని హాస్పిటల్స్‌లో సీజనల్‌ వ్యాధులకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని అధికారులు మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తెచ్చారు. సమీక్షలో రాష్ట్ర వైద్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టినా జడ్‌ చోంగ్తూ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో ఉదయ్‌ కుమార్‌, డీఎంఈ డాక్టర్‌ నరేంద్ర కుమార్‌, డైరెక్టర్‌ అఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ రవీందర్‌ కుమార్‌, టీవీవీపీ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌ కుమార్‌, స్పెషల్‌ ఆఫీసర్‌ విమలా థామస్‌లు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *