ఈ ప్రయాణంలో ఆర్ఎస్ఎస్ ఎన్నో పదుల సంఖ్యలో దాని అనుబంధ సంస్థలను స్థాపించింది. అందులో ప్రధానంగా దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తున్న భారతీయ జనతా పార్టీ ఒకటి బజరంగ్ దళ్ , విశ్వహిందూ పరిషత్ ఇలా మొదలైన సంస్థలు దాని క్షేత్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి సంఘ్ పరివార్ సంస్థలు అంటారు. భారతీయ ప్రాచీన సాంప్రదాయాలను రక్షించడంలో భాగంగా స్వయంసేవకులు నిస్వార్ధంగా సేవ చేయడం ఈ సంస్థ గొప్ప లక్షణం. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా అభివర్ణించిన సంఘ్ మాత్రం రాళ్లను,పూలను సమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణతో ఒక బలమైన ఆత్మవిశ్వాసంతో అనునిత్యం సేవలో ముందుకు నిలుస్తూ ఉండడం ఈ సంస్థ గొప్పతనం.
భారతదేశం ఎన్నో సహజ వనరులకు పుట్టినిల్లు. విలక్షణమైన సంస్కృతి, సాంప్రదాయాలకు చిరునామాగా భారత్ ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. కర్మభూమి గా,వేద భూమి గా విభిన్నమైన లక్షణాలను కలిగి ఉన్న అఖండ భారతం మనది. భారతదేశానికి స్వతంత్రం సాధించడానికి ఎందరో మహా పురుషులకు జన్మభూమిగా మారిన పరమ పవిత్రమైన నేల. అలాంటి మహా పురుషులలో డాక్టర్ కేశవ్ బలరాం హెడ్గేవర్ ఒకరు.ఈ మహానీయుడు అటు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూనే స్వాతంత్ర్య సాధించిన అనంతరం భారతదేశాన్ని ఏ విధంగా రక్షించుకోవాలని వినూత్నమైన ఆలోచనలు చేసేవారు. భారతదేశం యొక్క సనాతన ధర్మం,సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవడంలో ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలని ఒక మేధోపరమైన ఆలోచన నుండి జనించింది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ యస్ యస్). 1925 సెప్టెంబర్ 27న ఆరుగురు సభ్యులతో నాగపూర్ లోని చిన్న మైదానంలో విజయదశమి రోజు సంఘాన్ని స్థాపించారు. దేశ చరిత్రలో భాగమైన ఈ సంస్థ మూలాలు మన తెలుగు నేలలో ఉన్నాయని చాలామందికి తెలియకపోవచ్చు. కేశవ్ బలరాం హెడ్గేవర్ జన్మస్థలం బోధన్ తాలూకలో కందకుర్తి అనే చిన్న గ్రామం. హెడ్గేవర్ వాళ్ళ కుటుంబం తొలినాళ్లలో ఇక్కడే ఉండేవారు.
కాలక్రమేణ వీరి కుటుంబం మహారాష్ట్రలోని నాగపూర్ లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. సాంప్రదాయ కుటుంబంలో జన్మించి చిన్నతనం నుండి భారతదేశం దాని యొక్క సనాతన ధర్మం ,హైందవ సాంప్రదాయాలు గురించి తెలుసుకున్నారు.ఉన్నత విద్య పూర్తయిన తర్వాత 35 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ వాళ్ల ఆకృత్యాలను విమర్శిస్తూ వచ్చారు.స్వామి వివేకానంద, అరబిందో లాంటి హిందూ సామాజిక ఆధ్యాత్మిక సంస్కర్తల భావజాలానికి ఆకర్షితులయ్యారు. 1921లో ఒక ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించారు. హిందూ మహాసభలో సభ్యుడిగా చేరి చాలా కాలం పాటు అందులో కొనసాగారు. భారతీయులపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడానికి స్వయంగా సేవ చేయగల ఆలోచనలు కలిగిన వాళ్లను ఏకం చేయడం కోసం ఆర్ఎస్ఎస్ ను బలోపేతం చేయడానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 99ఏళ్ల క్రితం ఆర్ఎస్ఎస్ ఆవిర్భంలో మొదటగా భయ్యాజీ థానే, బావురావ్ దేవారన్, బాలసాహేబ్ దేవారన్, వెంకటప్ప పాట్కీ,అప్పాజీ జోష్ అనే ఆరుగురు సభ్యులుగా ఉన్నారు.

నాడు ఆరుగురు సభ్యులతో మొదలైన సంస్థ నేడు సుమారు 50 లక్షలకు పైగా స్వయంసేవకుతో వెలుగొందుతుంది. భారతదేశ నైతిక ,సాంస్కృతిక , ఆధ్యాత్మిక ,సాంప్రదాయాలను సంరక్షించడమే ఈ సంస్థ ప్రధాన ఆశయం.ఇందులో భాగంగా హైందవాన్ని ఒక మతంగా కాకుండా ఒక జీవన విధానంగా ఈ సంస్థ భావిస్తుంది. భారతదేశ జాతిని, భారత దేశ ప్రజలను భరతమాతగా భావించి వారికి విశేషమైన సేవలు అందించడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం. ఈ సంస్థకు గుర్తుగా కాషాయ జెండాను ఎంచుకున్నారు.ఈ సంస్థ సర్వోన్నత నాయకత్వాన్ని సర్ సంఘ్ చాలక్ గా పేర్కొంటారు. సంఘ్ స్థాపించినప్పటి నుండి 1940 వరకు సర్ సంఘ్ చాలక్ గా డాక్టర్ జీ కొనసాగారు .ఈ సందర్భంగా కూడా ఆయన1930 సంవత్సరంలో దాదాపు తొమ్మిది నెలలుగా జైలు జీవితం గడిపారు. ఇప్పటివరకు ఆరుగురు సర్ సంఘ్ చాలక్ లుగా తమ సేవలందించారు. వారిలో 1993 సంవత్సరంలో మధుకర్ దత్తాత్రేయ దేవారవ్ దాదాపు రెండు దశాబ్దాలుగా సర్ సంఘ్ చాలక్ తమ సేవలను కొనసాగించారు. తదనంతరం రాజేంద్ర సింగ్ 2000 సంవత్సరం వరకు ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ గా పూర్తి సమయాన్ని కేటాయించారు. ఆ తర్వాత 2000 సంవత్సరం నుండి 2009 వరకు సుదర్శన్ జీ తర్వాత 2009మార్చి21 నుండి మోహన్ భగవత్ సర్ సంఘ్ చాలక్ గా కొనసాగుతున్నారు. 1928 సంవత్సరంలో దాదాపు 99 మంది యువకులు ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఆకర్షితులై సంఘంలో చేరడం జరిగింది.అప్పుడు డాక్టర్ జీ ఒక పవిత్రమైన ప్రార్థనను వారికి బోధించడం జరిగింది. అదే ప్రార్థనను నేటికి ఆర్ఎస్ఎస్ అనుసరిస్తూ వస్తుంది. ఆర్ఎస్ఎస్ అంటే గుర్తుకు వచ్చేది తెల్లని చుక్క, నల్లని టోపీ కాకి రంగు నిక్కర్ ,తోళు బెల్టు కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా నిక్కరు స్థానంలో ప్యాంట్ తీసుకురావడం జరిగింది.
ఈ ప్రయాణంలో ఆర్ఎస్ఎస్ ఎన్నో పదుల సంఖ్యలో దాని అనుబంధ సంస్థలను స్థాపించింది. అందులో ప్రధానంగా దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తున్న భారతీయ జనతా పార్టీ ఒకటి బజరంగ్ దళ్ , విశ్వహిందూ పరిషత్ ఇలా మొదలైన సంస్థలు దాని క్షేత్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి సంఘ్ పరివార్ సంస్థలు అంటారు. భారతీయ ప్రాచీన సాంప్రదాయాలను రక్షించడంలో భాగంగా స్వయంసేవకులు నిస్వార్ధంగా సేవ చేయడం ఈ సంస్థ గొప్ప లక్షణం. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా అభివర్ణించిన సంఘ్ మాత్రం రాళ్లను,పూలను సమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణతో ఒక బలమైన ఆత్మవిశ్వాసంతో అనునిత్యం సేవలో ముందుకు నిలుస్తూ ఉండడం ఈ సంస్థ గొప్పతనం.స్వాతంత్ర ఉద్యమంలో అత్యంత కీలక ఘట్టమైన క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉండడం చాలా గొప్ప విషయం. భారతదేశానికి స్వాతంత్ర్య వచ్చిన ఏడాదే కెన్యాలో భారతీయ స్వయంసేవక్ సంఘ్ ఏర్పాటు చేయడం సంఘ్ దార్శనికతకు నిదర్శనం. 1938 సంవత్సరం డిసెంబర్ నాగపూర్ ఆర్ఎస్ఎస్ శిక్ష వర్గాలో స్వాతంత్ర్య సమరయోధుడు వీరసావర్కర్ పాల్గొనడం జరిగింది.
ఆ ఏడాది బాంబే ప్రెసిడెన్సీ ప్రభుత్వ ఉద్యోగులు సంఘ్ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొన వద్దాని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదే సమయంలో డాక్టర్ జీ హైదరాబాద్ లో నిజాం పాలకులకు వ్యతిరేకంగా హిందూ యువక్ పరిషత్ ను స్థాపించి భాగ్యనగర్ విముక్తి సంగ్రహ్ పేరుతో ఉద్యమించడం జరిగింది. ఆర్ఎస్ఎస్ దేశంలో ఏ మూలన విపత్తు సంభవించిన సహాయం చేయడంలో ఆపద్బాంధవులా ఉంటుంది. వరదలు, భూకంపాలు, దాడులు, అల్లర్లు ఇలా ఎలాంటి ఆపదలు వచ్చిన సమయంలో సేవ చేయడం కోసం అహర్నిశలు పాటుపడుతుంది.దేశంలో జరిగే ఆకృత్యాలను, విపత్కర సంఘటనలను ముందే పసిగట్టి ప్రభుత్వాలకు తమ సలహాలను తెలియజేస్తుంది. దేశ ప్రజల సంక్షేమానికి దేశ రక్షణకై తీసుకోవాల్సిన చర్యల గురించి అవలోకనం చేసి సూచనలు చేస్తుంది. ఆర్ఎస్ఎస్ అనేది ఒక కరడు కట్టిన హిందూ భావజాలం కలిగిన సంస్థగా కొందరు ప్రచారం చేసిన అది భారతదేశ ఖ్యాతిని,ఘన కీర్తిని కాపాడుటలో తన వంతు కృషి చేస్తుంది.

బాబ్రీ మసీద్ కూల్చివేత, గాంధీ హత్య ఇలా అనేక వివాదాలకు కేంద్ర బిందువు అని చెప్పిన చాలామందికి ఇది ఒక ఆరాధ్య దైవం. ఆర్ఎస్ఎస్ అనేది సేవా భారతి పేరా దాదాపు రెండు లక్షలకు పైగా సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తుంది.1946 ఆగస్టు 16 కలకత్తాలో రెండు వర్గాల మధ్య ఉచకోత జరిగినప్పుడు ఎంతో సహాయ సహకారాలు అందించింది. 1947 జూన్ 3 దేశవిభజన సమయంలో అల్లర్లు జరిగి పంజాబ్ ,బెంగాల్ సరిహద్దు రాష్ట్రంలో అనేక దాడులు జరిగాయి అప్పుడు 3 వేలకు పైగా సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి సంఘ్ తన ఔదార్యాన్ని చాటుకుంది.1952 సంవత్సరం దేశంలో గో హత్యను నిషేధించాలని దాదాపు కోటి మందికి పైగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టి ప్రభుత్వాలకు పంపింది. 1954లో పోర్చుగీసులో దాద్రా హవేలీ నగరం విముక్తికై పోరాటాన్ని చేసింది.1955 లో పోర్చుగీసు ఆధీనంలో ఉన్న గోవా విముక్తి కూడా అలుపెరుగని పోరాటానికి నాంది పలికింది.1966 సంవత్సరంలో బీహార్ ప్రాంతంలో కరువుతో తల్లడిల్లుతున్న ప్రాంతాల ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందించింది.
1977 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో పెను తుఫాను సంభవించినప్పుడు తన శక్తిని మించి సహయ, సహకారాలు చేపట్టింది.2001 గుజరాత్ భూకంపం విపత్తులో కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ముందుండి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆర్ఎస్ఎస్ అనేది కేవలం ఒక హిందుత్వ సంస్థని ముద్రవేసిన కొందరి అతి మేధావుల మాటను తిప్పికొట్టేలా సంఘ్ అద్వితీయమైన కార్యాచరణలో ముందుంటుంది. భారతీయత, సేవగుణంతో సంఘ్ ఎల్లప్పుడూ శ్రమిస్తూనే ఉంటుంది.భారతీయుడు సాటి భారతీయునికి ఎప్పుడూ పరాయివాడు కాదని నమ్మి అందరిని సంఘటితం చేసి ఒకేతాటి మీదికి తీసుకురావడం కోసం ఆర్ యస్ యస్ అవిరళంగా కృషి చేస్తుంది. దేశంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్న తమ శక్తి సామర్థ్యలమేరా సేవ చేయడంలో వెనకడుగు వేయకా ఆదర్శంగా నిలుస్తుంది.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధానంగా భావించేది శాఖ. ప్రతిరోజు శాఖలో ఒక వ్యక్తి యొక్క నిర్మాణం కోసం ఉపయోగపడే ప్రతి అంశాన్ని చేరువ చేయడం జరుగుతుంది. ఒక వ్యక్తి పురోగతి సాధించాలంటే మానసికంగానే కాదు భౌతికంగా శారీర ధారుడ్యం కలిగి ఉండాలనేది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల్లో ఒక భాగం. అందు కోసం వివిధ రకాల వ్యాయామం తప్పనిసరి. దేశభక్తి భావజాలం,జాతీయత అంశాలపై నిరంతరం యువతను జాగృత పరిచే నిస్వార్థమైన సేవకు మారుపేరు ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ లోకి అన్ని వర్గాల వారు ఆహ్వానితులే కానీ వారి ఎజెండా మాత్రం దేశభక్తి, సేవ గుణం, క్రమశిక్షణ కలిగి ఉండడం. దేశ పురోగతిలో ఆర్ఎస్ఎస్ ఎన్నో అంశాల్లో జరగని ముద్రవేసి క్రమశిక్షణ అంటే ఆర్ఎస్ఎస్. ఆర్ యస్ యస్ అంటే క్రమశిక్షణ అనే విధంగా ఎంతో మంది మహనీయుల గుర్తింపు పొందింది. ఆర్ఎస్ఎస్ స్థాపించి సుమారు వంద సంవత్సరాలు కావస్తున్నా క్రమంలో ఇంత గొప్పగా ఒక సంస్థ అంతులేని అభిమానాన్ని పొందడం చాలా అరుదుగా చెప్పవచ్చు. ఆర్ఎస్ఎస్ అంటే నేటికీ చాలామందికి తెలియకపోవచ్చు కానీ దాని సేవ మార్గం,దేశభక్తి ,జాతీయత భావజాలం నేటి యువతకు చేరువ చేయడంలో ఆర్ఎస్ఎస్ నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది.
వంశీకృష్ణ గౌడ్.బండి
రంగయ్యపల్లి, రేగొండ
జయశంకర్ భూపాలపల్లి





