హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో ఆర్‌ఆర్‌బీ సెక్షన్ కంట్రోలర్ పరీక్ష బుధవారం నుచి ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించి మాక్ టెస్టులను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు డైరెక్ట్ లింక్ ద్వారా ఉచిత మాక్ టెస్ట్‌లు రాయవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఎలాంటి పాస్‌వర్డ్ లేకుండా ఈ ఉచిత మాక్ టెస్టును ఉపయోగించుకోవచ్చు. 11, 12 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో ఆర్‌ఆర్‌బీ సెక్షన్ కంట్రోలర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు అడ్మిట్ కార్డులను సైతం ఇప్పటికే బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.కాగా భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు దేశ వ్యాప్తంగా గల అన్ని రైల్వే జోన్లలో మొత్తం 368 పోస్టులతో సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి ఈ నియామక పక్రియ చేపట్టింది. డిగ్రీతో ఈ నియామకాలను భర్తీ చేయనుంది. రామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ యూజీ 2026) పరీక్షకు సంబంధించి దరఖాస్తుల సవరణకు ఫిబ్రవరి 11 వరకు అవకాశం ఇచ్చింది. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు రేపటితో గడువు ముగియనుంది. ఇక సీయూఈటీ యూజీ ప్రవేశ పరీక్ష మే 11 నుంచి 31 మధ్య ఆన్‌లైన్ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. ఈ పరీక్ష ద్వారా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2026-27 విద్యాసంవత్సరానికి పలు యూజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 13 భాషల్లో 37 స్జబెక్టులకు ఈ పరీక్ష జరనుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





