“ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్‌ను కార్నర్ చేయలని చూసి.. ఒక రకంగా సక్సెస్ కూడా అయ్యింది కాంగ్రెస్ పార్టీ..! కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు.. మేడిగడ్డ కుంగిపోవడం కూడా కేసీఆర్ వైఫల్యమే అని ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేసింది..! అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంక్వైరీ పేరుతో కేసీఆర్‌ను కూడా విచారించింది..! ఇప్పుడు.. దానికి కౌంటర్ అన్నట్లు కేసీఆర్ ప్రాజెక్టులతోనే రీఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది..! పోగోట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నది కేసీఆర్ వ్యూహమా..? లేక ప్రాజెక్టులు అంటే కేసీఆర్, బీఆర్‌ఎస్సే అని చెప్పే ప్రయత్నమా అన్నది తేలాలి.. ”
“ఇప్పటి వరకు ఓ లెక్క..! ఇప్పటి నుంచి ఇంకో లెక్క..! మస్త్ టైమ్ ఇచ్చినం..! కిరికిరి మాటలు.. కారు కూతలు కూస్తామంటే కుదరదు ఇంక..! ఒక్కొక్కడి తోలు తీస్తాం..! ప్రజలతో కలిసి ఎక్కడికక్కడ నిలబెడతాం..!..” చాలా రోజుల తర్వాత ప్రెస్‌మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్ ఇది..! బీఆర్‌ఎస్ శ్రేణుల్లో జోష్ నింపిన ప్రెస్‌మీట్ ఇది..! కాంగ్రెస్ నేతలకు పనిపెట్టిన ప్రెస్‌మీట్ కూడా ఇది..! ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.. ఇక నుంచి దబిడ దిబిడే..! ఇది ఒకటో స్థాయి ప్రమాద హెచ్చరిక..! తర్వాత తుఫానే అంటున్నారు బీఆర్‌ఎస్ నేతలు..! కేసీఆర్ హెచ్చరికలకు ప్రభుత్వ పెద్దలు ఊరుకుంటారా… తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. మరి. కేసీఆర్ ఏం చేసినా..మాట్లాడినా…దానికి ఒక లెక్క ఉంటుంది. పద్దతి ప్రకారం చేస్తారు. కొన్ని సార్లు అవి వికటించిన సందర్భాలూ ఉన్నాయి. మనం చూసాం కదా…
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. డల్ అయిన బీఆర్‌ఎస్ క్యాడర్‌కు రెండేళ్ల తర్వాత ఫుల్ జోష్ ఇచ్చారు కేసీఆర్..! ఆకలితో ఉన్న కార్యకర్తలకు ఫుల్ మీల్స్ పెట్టారు..! తన ఎంట్రీతో బీఆర్‌ఎస్‌నే కాదు.. రాష్ట్రాన్నే తన వైపుకు తిప్పుకున్నారు..! ఏ మాత్రం తగ్గలేదు..! ఎక్కడా తడబడలేదు..! సూటిగా.. స్పష్టంగా.. ఫుల్ క్లారిటీతో చెప్పాలనుకున్నది చెప్పేశారు..! ఇవ్వాల్సిన వార్నింగ్ ఇచ్చేశారు..! ఏమేం చేయబోతున్నారో చూపించేశారని గులాబీ శ్రేణులు సంబరపడుతున్నాయి. ప్రాజెక్టులు, ప్రభుత్వ వైఫల్యాలు తమ ఎజెండా అని కేసీఆర్ ఇక నుంచి.. స్వయంగా తానే రంగంలోకి దిగుతున్నట్లు కూడా ప్రకటించేశారు కేసీఆర్..! మాకు రెండు బాధ్యతలున్నయ్.. ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా.. రెండు ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్ర హక్కులు, నీళ్లు, ప్రయోజనాలను రక్షించుకోవాలి..! తెలంగాణ ప్రజల కోసం. జరిగే అన్యాయాన్ని, జల దోపిడీని అడ్డుకుంటాం ..! తెలంగాణ కోసం ఎంతదాకైనా పోతం.నేనే రంగంలోకి దిగుతున్న.. వి విల్ ఫైట్..! అంటూ కేసీఆర్ ఫైరైపోయారు..
ఇక్కడే మొదలైంది అసలు కథ. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీని కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు లకు అప్పజెప్పిన కేసీఆర్ .. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఆశించిన రిజల్ట్ రాలేదు…పంచాయతీ ఎన్నికల్లోను అదే పరిస్థితి. త్వరలో జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపాలిటీలకు ఎన్నికలలో ఇవే ఫలితాలు వస్తాయని భయపడిన కేసీఆర్ బయటికి వచ్చారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు కదా.. అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవుతారని గొప్పగా ప్రచారం చేసుకున్న గులాబీ పార్టీ శ్రేణులకు కేసీఆర్ మళ్ళీ నిరాశే మిగిల్చారు. అటెండెన్స్ కోసమే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లారు తప్ప ప్రజల గురించి మాట్లాడింది ఏమీ లేదు. అనూహ్యంగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు ఏకంగా అసెంబ్లీని బాయ్ కాట్ చేసేశారు. కీలకమైన పాలమూరు రంగారెడ్డి తో సహా తెలంగాణ నీటి వాటాలపై మాట్లాడే అవకాశాలని బిఆర్ఎస్ వదులుకుంది.
రెండేళ్ల తర్వాత ప్రజల ముందుకు వచ్చిన కేసీఆర్.. తాను ఎత్తుకున్న టాపికే ఇంట్రెస్టింగ్‌గా ఉంది..! ప్రాజెక్టులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు.. ముఖ్యంగా పాలమూరు జిల్లాకు అన్యాయం జరుగుతోందంటూ కేసీఆర్.. డైరెక్ట్‌గా నీటి వాటాల మీదకు టాపిక్‌ను తీసుకెళ్లారు..! ఇది ఎందుకు అంత ఇంట్రెస్టింగ్ అంటే.. ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్‌ను కార్నర్ చేయలని చూసి.. ఒక రకంగా సక్సెస్ కూడా అయ్యింది కాంగ్రెస్ పార్టీ..! కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు.. మేడిగడ్డ కుంగిపోవడం కూడా కేసీఆర్ వైఫల్యమే అని ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేసింది..! అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంక్వైరీ పేరుతో కేసీఆర్‌ను కూడా విచారించింది..! ఇప్పుడు.. దానికి కౌంటర్ అన్నట్లు కేసీఆర్ ప్రాజెక్టులతోనే రీఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది..! పోగోట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నది కేసీఆర్ వ్యూహమా..? లేక ప్రాజెక్టులు అంటే కేసీఆర్, బీఆర్‌ఎస్సే అని చెప్పే ప్రయత్నమా అన్నది తేలాలి.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. యాభై ఏళ్లు పాలించిన కాంగ్రెస్, తర్వాత ఇరవై ఏళ్లు పాలించిన టీడీపీ పాలమూరును కోలుకోలేని దెబ్బకొట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు.. మరి అధికారంలోకి వచ్చిన తరవాత కేసీఆర్ ఏం చేశారు… పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేయలేక పోయారు. నేటి పంపకాల విషయంలో తెలంగాణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ద్రోహం చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి నిండు సభలో ఫైర్ అయ్యారు కదా.. తెలంగాణకు వందేళ్ల ద్రోహం చేశారని సీఎం తీవ్ర ఆరోపణలు చేశారు. నేటి వాటాల్లో తెలంగాణ హక్కుగా రావాల్సిన వాటాను కేసీఆర్ ఏపీకి వదిలేశారని కాంగ్రెస్ లీడర్లు ఊరూరా ప్రచారం చేస్తున్నారు.
నేనే ఊరూరా తిరుగుత అన్న కేసీఆర్ మళ్ళీ ఫాం హౌస్ కు వెళ్లిపోయారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయించిన కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులను పండబెట్టిండని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తన దోస్తు జగన్మోహన్ రెడ్డి కోసం కృష్ణ జలాల్లో నీటి దోపిడీకి కేసిఆర్ సహకరించారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే కెసిఆర్ తెలంగాణకు చేసిన ద్రోహాన్ని సరిదిద్దే పనిలో పడిన రేవంత్ రెడ్డి 16 ప్రాజెక్టులకు జీఓ ను ఇష్యూ చేసి డిపిఆర్లు రెడీ చేస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నేనే ఆపించానని రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఏపీలో కూడా ప్రకంపనలు మొదలయ్యాయి టిడిపి వైసిపి ల మధ్య బ్లేమ్ గేమ్ నడుస్తుంది తెలంగాణలోనూ టిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపిల వార్ నడుస్తోంది మొత్తానికి నీళ్ల పంచాయితీ అన్నదమ్ములుగా కలిసుందాం అనుకున్నా తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు రేపుతున్న ఈ పొలిటికల్ పార్టీలు. అసలు వాటర్ ఇంటేక్ సోర్స్ ను జూరాలను కాదని శ్రీశైలం కు మార్చడం వెనుకున్న మతలమేంటో చెప్పాలని కెసిఆర్ డాటర్ కవిత ప్రశ్నించింది. ఇప్పటికీ సరైన సమాధానాలు లేవు. ఎల్లూరు పంపు హౌస్ ను ఓపెన్ పంప్ హౌస్ కాకుండా అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ గా మార్చడం వల్ల 1400 కోట్ల రూపాయల అదనపు ఖర్చు అయింది. పైగా పంపుల కెపాసిటీ తగ్గింది 30 మీటర్ల ఎత్తు కూడా పెరిగింది. ఫలితంగా ఎగువ నుంచి నీటిని తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది ఇలా ఎందుకు మార్చారో చెప్పాలని కవిత డిమాండ్ ….
నీళ్లు, నిధులు, నియామకాలు టాగ్ లైన్ తో నడిచిన తెలంగాణ మలి దశ ఉద్యమం ఆశల ఆకాంక్షల మేరకు కేసిఆర్ సర్కారు పనిచేయలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ సైతం ఇదే విమర్శలను చేస్తోంది. ఇప్పుడు కవిత కూడా అవే ప్రశ్నలని సంధిస్తోంది సామాజిక తెలంగాణ కోసం ఉద్యమిస్తానన్న ఆమె తన ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేసి పార్టీని రెడీ చేసుకుంటున్నారు. టిఆర్ఎస్ -బిఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఆమె ఒక్కటి ఒక్కటిగా బయటపెడుతున్నారు మరోవైపు ఫోన్ టాపింగ్ కేసు, కాళేశ్వరం అవినీతి కేసు ఇతర రకరకాల కేసులతో బీఆర్ఎస్ సతమతమవుతుంది ప్రజలు ఇంకా కెసిఆర్ ను నమ్మడం లేదన్న వాస్తవం తెలుసుకున్న కేసీఆర్ తన రంగంలోకి దిగాడు అన్న మాట వాస్తవం… కవిత జిల్లాల బాట పట్టి ప్రజలతో మమేకమవుతున్న తీరును చూసి గులాబీ పార్టీ కూడా జిల్లాల బాట పట్టింది.. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం జిల్లాల లో పర్యటిస్తున్నారు… సో అనుకున్నంత ఈజీగా పార్టీ భవిష్యత్తు ఉండదని కెసిఆర్ తన ప్రెస్ మీట్ ద్వారా చెప్పకనే చెప్పేశారు
-వంగ మహేందర్ రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్





