ఓయూ పరిపాలన విభాగంలో మీ దార్శనికతకు అనుగుణంగా మార్పు రావాలి. కానీయూనివర్సిటీ పరిపాలన విభాగం అందుకు సిద్ధంగా లేదనే అనుకోవాలి.ఎందుకంటే ఓయూ పరిపాలన విభాగంతో అధ్యాపకులు, విద్యార్థులు, సాధారణ ఉద్యోగుల మధ్య ఘర్షణ కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ, అది నేడు తీవ్ర స్థాయికి చేరి వీసీ , రిజిస్ట్రార్ , ఓ ఎస్డీ లాంటి వారంటే గౌరవం లేకుండా పోయింది. వీసీవిద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని వాటిని శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరించడంలో తగిన శ్రద్ధ చూపడంలేదు. ఆర్థికపరమైన అంశాలలో పరిపాలన విభాగం ఎంతమాత్రం శ్రద్ధ చూపడంలేదు. ప్రస్తుత ఓయూ పరిపాలన విభాగం అశాస్త్రీయ పద్ధతిలో ఆర్ట్స్ కళాశాలకు రూ.5 కోట్ల 90 లక్షలు కేవలం సున్నం వేయడానికి కేటాయించడం దాని అవగాహనా రాహిత్యానికి నిదర్శనం.
ముఖ్యమంత్రికి విద్యార్థులు, విభాగాధిపతులు, బోధనేతర సిబ్బంది విజ్ఞప్తి
డిసెంబర్ 10న ఉస్మానియా యూనివర్సిటీని (ఓయూ) సందర్శించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం నూతన అధ్యాయానికి నాంది. ఓయూలో జరిగే మార్పులకు మీరే కేంద్ర బిందువు కాబోతున్నారు. మీకు అభివందనాలు. ఏడవ నిజాం ఉల్-ముల్క్ ఉస్మాన్ అలీ ఖాన్, (7వ నిజాం) స్థాపించిన ఓయూ నేడు ఐకాన్ గా ఎదిగింది. ఓయూను ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయంగా మార్చాలనే మీ దార్శనికత నాటి నిజామును పోలివున్నదనడంలో సందేహంలేదు. విద్యార్థులు, అధ్యాపకులు, మరియు వివిధ విభాగాలలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది నిండు మనసుతో మీ రాకను స్వాగతిస్తున్నారు. ముఖ్యమంత్రిగా మీరు దృఢ చిత్తంతో ఉంటే అన్ని వనరులు సమకూరుతాయి, మీ వెనుకాల నడవడానికి విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది సిద్ధంగా వున్నారు.
ఓయూ పరిపాలన విభాగంలో మీ దార్శనికతకు అనుగుణంగా మార్పు రావాలి. కానీయూనివర్సిటీ పరిపాలన విభాగం అందుకు సిద్ధంగా లేదనే అనుకోవాలి. ఎందుకంటే ఓయూ పరిపాలన విభాగంతో అధ్యాపకులు, విద్యార్థులు, సాధారణ ఉద్యోగుల మధ్య ఘర్షణ కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ, అది నేడు తీవ్ర స్థాయికి చేరి వీసీ , రిజిస్ట్రార్ , ఓ ఎస్డీ లాంటి వారంటే గౌరవం లేకుండా పోయింది. వీసీవిద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని వాటిని శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరించడంలో తగిన శ్రద్ధ చూపడంలేదు.
ఆర్థికపరమైన అంశాలలో పరిపాలన విభాగం ఎంతమాత్రం శ్రద్ధ చూపడంలేదు. ప్రస్తుత ఓయూ పరిపాలన విభాగం అశాస్త్రీయ పద్ధతిలో ఆర్ట్స్ కళాశాలకు రూ.5 కోట్ల 90 లక్షలు కేవలం సున్నం వేయడానికి కేటాయించడం దాని అవగాహనా రాహిత్యానికి నిదర్శనం. ఆర్ట్స్ కళాశాలలో దాదాపు 90 రూములు ఉంటాయి కళాశాల బయటి భాగంలో సున్నం వేయడానికి వీలు కుదరదు. కేవలం కొన్ని కారిడార్లు, గదులలో సున్నం వేయాలి. ఒక్కొక్క గదికి లక్ష రూపాయలు అనుకున్న 90 లక్షలతో అయిపోతుంది. మరి మిగతా రూ.5 కోట్లు ఎందుకు? ఎక్కడికి పోయినట్లు? .
ప్రస్తుత సిఏఎస్ ఇంటర్వ్యూలు నియామక ఆదేశాలు తప్పుల తడకగా వున్నాయి. యూజీసీ గైడ్లైన్స్ అతిక్రమించవద్దంటూ సుప్రీంకోర్టు నవంబర్ 27 నాడు వెలువరించిన తీర్పును ఈ పుస్తకంలో పొందు పరుస్తున్నాం. పరిశీలించండి. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోవడం, ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడం, నియమాకాలలో పారదర్శకతను పాటించకపోవడం తీవ్రమైన తప్పిదాలు. ప్రస్తుతం ఓయూలో ఎవరికీ పాలనా విభాగంపై సదాభిప్రాయం లేదు.
ఇప్పుడు పనిచేస్తున్న అధ్యాపకులు గత ప్రభుత్వం హయాంలో నియమితులయ్యారు. వీరి నియమకాలలో తప్పు జరిగి ఉంటే అది గత ప్రభుత్వాలకు వర్తిస్తుంది. మొత్తం శాంక్షన్ పోస్టులు 1,267 కాని ప్రస్తుతము యూనివర్సిటీలో 331- 354 రెగ్యులర్ అధ్యాపకులు ఉన్నారు. 74% శాంక్షన్డ్ పోస్టులకు నియామకాలు చేపట్టి అధ్యాపకులతో నింపాలి. ఓయూ లోని విద్యార్థులు 331 రెగ్యులర్ అధ్యాపకులు, 446 కాంట్రాక్ట్ టీచర్స్ మరియు 200 పార్ట్ టైం అధ్యాపకులతో విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. అధ్యాపకులలో కొందరు తమ విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదు. కొందరు అధ్యాపకులు తరగతి గదిని చూసి ఎన్నాళ్ళయిందో.
ఏది ఏమైనా వారు యూనివర్సిటీ వ్యవస్థలోని వారు కనుక వారిని పక్కకు పెట్టడం కుదరదు. అధ్యాపకులతో పని సక్రమంగా ఎలా చేయించాలో ఆలోచన చేయాలి. ప్రస్తుత వి సి ఈ విషయంలో ఆలోచన చేసినట్లు దాఖలాలు లేవు. ఈ అంశాన్ని మీరు గుర్తించాలి. మరి కొందరు అధ్యాపకులు కేవలం పరిపాలన విభాగంలో ఉండడానికి నియామకం జరిగినట్లు ప్రవర్తిస్తున్నారు. పోనీ వారి వలన పరిపాలన సక్రమంగా ఉందా? అంటే అది లేదు. విచ్చలవిడి అవినీతి, ఆశ్రిత పక్షపాతంతో నైతికత లోపించిన పరిపాలన విభాగం, అధ్యాపకులను విద్యార్థులను ప్రభావితం చేయలేకపోతున్నది. సత్ప్రవర్తన కలిగి తరగతి గదులలోవిద్యార్థులకు బోధన చేసే సామర్థ్యం ఉన్న వారిని, ఋజు ప్రవర్తన గల వారిని గుర్తించి పరిపాలన విభాగంలోకి తక్షణమే తీసుకోవలసిన అవసరం వుంది. మీరు ఈ అంశాల పైన దృష్టి పెట్టాలి.
కొందరు అధ్యాపకులు వెన్నుముక లేకుండా తయారయ్యారు. అధ్యాపకులను క్యాడర్ వైజ్ గా చూసినట్లయితే భారతదేశ ఉన్నత సివిల్ సర్వెంట్స్ తో సమానమైన వేతన భత్యాలు పొందుతున్నారు. వీరు సివిల్ సర్వెంట్స్ ను, రాజకీయ నాయకులను చూస్తే సాగిలపడి పోతుంటారు. వీరిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలి, తమ మేధాశక్తి పెంపొం దించుకునేటట్లుగా కార్యోన్ముఖులను చేయాలి. మేధాశక్తి, ఆత్మస్థైర్యము గల అధ్యాపకులు మాత్రమే విశ్వ విద్యాలయాన్ని ప్రపంచ స్థాయికి తీసుక పోగలరు.
మన రాజకీయ గణం కొందరు అధ్యాపకులను లొంగ దీసుకుని మా వాళ్ళతో తమకు నచ్చిన విధంగా కావలసిన పనులు చేయించు కుంటున్నారు. మీరు ఈ రాజకీయుల్ని యూనివర్సిటీ వ్యవహారాల్లో వేలు పెట్టకుండా కట్టడి చేయాలి. ఓయూ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాలంటే ఇది చాలా ముఖ్యం. ఇకనుండి జరగబోయే నియమకాలలో ఎటువంటి రాజకీయ వత్తిళ్లు వుండకూడదు. మీ ఎమ్మెల్యేలను మంత్రులను కట్టడి చేయండి. అదేవిధంగా వీసీని కార్యోన్ముఖులను చేసి ప్రతిభకే పట్టం కట్టేలా ఇంటర్వ్యూలు నిర్వహించేలా చేయాలి. ఇది మీకు సాధ్యమయ్యే పనేనా? మేధాశక్తికి పట్టంకట్టి ఎలాంటి ఒత్తిళ్లు, ఆశ్రిత పక్షపాతం, ఆర్థిక లావాదేవీలు లేకుండా ప్రస్తుతం జరగబోయే రిక్రూట్మెంట్ చేయగలిగితే, అప్పుడు యూనివర్సిటీలోకి ప్రవేశించే ప్రతి అధ్యాపకుడు నిజాయితీగా పని చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి.
మనం డిజిటల్ విప్లవంలో నివసిస్తున్నాము. రాబోయే రోజులలో ఏఐ, నానో టెక్నాలజీ , క్వాంటం కంప్యూటింగ్ కలిసికట్టుగా సాంకేతిక విప్లవాన్ని మరింత ముందుకు తీసుకుపోతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్వాంటం వ్యాలీని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. క్వాంటం సైన్స్ కోర్సుకు వున్న ప్రాముఖ్యత దృష్ట్యా వచ్చే విద్యా సంవత్సరం (2026 – 2027) నుంచి క్వాంటం సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ ను ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను పరిశీలించండి. అలా చేస్తే భారతదేశంలో కాటన్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సును ఏర్పాటు చేసిన యూనివర్సిటీ మనదే అవుతుంది. సంకల్పం ఉండాలే కానీ 1000 కోట్లు కాదు మరెంతయిన ఏలాంటి భారం లేకుండా సమీకరించవచ్చు.
ఓయూలో చదువుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను సంప్రదించండి మనకు కావాల్సిన ఆర్థిక వనరులు సమకూరుతాయి. ప్రపంచ విద్య సంస్థలలో మౌలికంగా కనిపించేది భవనాలు రహదారులు. రహదారులు, మౌలిక వసతులు మరియు, భవనాలు ప్రపంచ స్థాయిలో ఉండేటట్లుగా రూపకల్పన చేయడం సంతోష దాయకమే. కాకపోతే మీరు నిర్మించబోయే రహదారులు, భవనాలు నేటి నుండి కనీసం ఐదు ఆరు వందల సంవత్సరాలు నిలబడేటట్లుగా రాజసం ఉట్టిపడేటట్లుగా మెటీరియల్ ఎంపిక చేసుకొని భవనాలను నిర్మించండి.
“రోమ్ ఒక్కరోజులో నిర్మించబడలేదు.” అలాగే ప్రపంచ స్థాయి విద్యాలయం కూడా.ఓయూని ప్రపంచ స్థాయి సంస్థగా చూడాలనే మీ ప్రయత్నాన్ని మొదటి అడుగుగా మేము భావిస్తున్నాం. శ్రమించే శక్తి సామర్థ్యాలు, తర్కశక్తి, అవగాహన, సహానుభూతి వంటి గుణాలను కలిగి ఉన్న నాయకత్వం ప్రస్తుతం ఓయూకు అవసరం. ఈ గుణాలు ఉన్నవారు నిజాయితీపరులై ఉంటారు. అటువంటి నాయకత్వాన్ని నియమిస్తారని ఆశిస్తున్నాం.
ఇట్లు
ఉస్మానియా యూనివర్సిటీ స్టెనోగ్రాఫర్లు,
డా. వెంకట దాస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీర్,
డా. వి. నతన్యల్ ఫిజిక్స్,
డా జె. వెంకటేశ్వరరావు,జువాలజీ,
డా రమేష్ పన్నీరు, హిస్టరీ.





