– అలైన్మెంట్ పూర్తిగా సిద్ధం కాలేదు
– రైతులకు తగిన నష్టపరిహారం చెల్లిస్తాం
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
చిట్యాల(నల్లగొండ జిల్లా), ప్రజాతంత్ర, అక్టోబర్ 4 : త్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ అలైన్ మెంట్ పూర్తిగా సిద్ధం కాలేదు డిపిఆర్ మాత్రమే సిద్ధమైంది అని ఆర్ అండ్ బి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సూర్యాపేట వెళ్లి తిరుగు ప్రయాణంలో చిట్యాల మండలం పెద్ద కాపర్తి సమీపంలో ఉన్న ఆర్గానిక్ హోటల్లో విలేకరులతో మాట్లాడుతూ త్రిబుల్ ఆర్ విషయంలో రైతులు ఆందోళ నలు, ధర్నాలు చేయవద్దు.. నా ఊపిరి ఉన్నంత వరకు అన్యాయం జరగనివ్వ ను.. 2018లో కేంద్రం ఆమోదించిన త్రిబుల్ ఆర్‌ను అప్పటి కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదు.. త్రిబుల్ ఆర్‌లో భూమి కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం పెంచుతామని చెప్పారు. డిసెంబర్‌లోగా సంగారెడ్డి వయా భువనగిరి చౌటుప్ప ల్ వరకు టెండర్లకు పిలుస్తాము ల్యాండ్ ఎక్విజషన్‌కు 6వేల కోట్లు అవుతుంటే కేంద్ర ప్రభుత్వం 3వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 3వేల కోట్లు పెడుతుంది అని అన్నారు. డిపిఆర్ మీద మంత్రుల కమిటీ వేసి చిన్న సన్నకారు రైతుల నష్టపో కుండా తగిన నష్టపరిహారం కట్టిస్తామని అన్నారు, సామాజిక మాధ్యమాలలో వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దు.. రాజకీయ పార్టీలు ధర్నాలు మాని ప్రభుత్వం చేసే పనికి సహకరించాలని కోరారు. త్రిబుల్ ఆర్ అలైన్మెంట్లో ఎలాంటి కంపెనీ అడ్డు వచ్చిన రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఉన్న అలైన్మెంట్ మార్చే పరిస్థితి ఉండదు.. గతంలో కేటీఆర్ ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తానని స్వయంగా వచ్చి నన్ను కలిసి బ్రతిమలాడినా నేను ఒప్పుకోలేదు.. ఇప్పటికే ఇక్కడ ఫార్మా కం పెనీలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.. మళ్ళీ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే కనీసం తాగడానికి నీరు కూడా కరవవుతుందని అన్నారు. కెసిఆర్ అప్పులు చేసి 90% కాలేశ్వరానికి పెడితే 10% ప్రజలకు ఉపయోగించాడని ఎద్దేవా చేశారు. ప్రజలు త్రిబుల్ ఆర్ విషయంలో ఎలాంటి అపోహలకు గురి కావదు.్ద. కచ్చితంగా భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని అన్నారు. కార్యక్రమంలో చిట్యాల, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ కోమ టిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి,సీనియర్ నాయకులు గుమ్మల మోహన్ రెడ్డి, కందిమల్ల శిశుపాల్‌రెడ్డి, ఆవుల యాదయ్య, ఎండి జమీరుద్దీ న్, ఎడ్ల మహాలింగం, నీలకంఠం లింగస్వామి,వడ్డే భూపాల్ రెడ్డి, తదిత రులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


