“ప్రతి పౌరుడికి స్వేచ్ఛ ‘స్వాతంత్ర తో కూడిన మానవ హక్కులు సమానంగా ఉన్నప్పుడే మానవ హక్కుల లక్ష్యం నెరవేరుతుంది. దేశములోని అన్ని రాష్ట్రాలలో ఏర్పడ్డ మానవ హక్కుల కమిషన్ హక్కుల సంరక్షణ కొరకు చేర్యలు చేపడుతున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘనలను సుమో టో గా తీసుకుంటున్నాయి. 2019 లో తెలంగాణలో ఇంటర్మీడియేట్ ఫలితాల్లో 18 మంది విద్యార్థులు మరణిస్తే వారి ఆత్మహత్య మీద జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. 2002 లో86 వ రాజ్యాంగ సవరణ ద్వారా6 నుండి 14 సంవత్సరాల బాల బాలికల కు నిర్భధ ప్రాథమిక విద్య అందించాలని 21 అధికరణములో పొందపరిచారు.”
“మానవ హక్కులు అంటే మంచి ఆరోగ్యం గౌరవప్రథమైన జీవితం మరియు రోజు వారీ ప్రజల ఇష్టాన్ని గౌరవించే హక్కు”
“డెనియా కాష్టిల్లో మాస్విడా”
మానవ హక్కులు ఆధునిక నాగరిక ప్రపంచానికి పునాదిరాల్లుగా నిలిచాయి. ప్రపంచ మానవ హక్కుల ప్రకటన జరగకముందు అనేక దేశాలలో బానిసత్వం ఉండేది. మనిషిని మనిషిగా చూడలేని అమానవీయ కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. మనిషి వర్తకం పేరుతో ఘోరాలు జరిగాయి .ఐరోపాలోని ఫూడలిస్తులు అనాగరికులైన ఆసియా ఆఫ్రికా దేశాల ప్రజలను ఓడలో గొలుసులతో బంధించి ఒక యజమాని నుంచి మరొక యజమానికి వస్తువులను అమ్మినట్లుఅమ్మేవారు. కొనుగోలు చేసిన వారు వారి ఎస్టేట్ లలో జీవితాంతం బానిసగా వెట్టి చాకిరి చేయించుకొనే వారు.
మానవ హక్కులు_ ప్రకటన
20 దశాబ్దంలో లో 1948 డిసెంబర్ 10వ తేదీ ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా వున్న మానవుల హక్కుల రక్షణ కొరకు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ప్రకటించింది..ప్రపంచంలో మానవుల పై జరుగుతున్న హింసను ‘పీడన ‘రాజ్య హింసను అరికట్టి మానవులకు గౌరవ ప్రదమైన జీవితానికి బరోసా ‘భద్రత ను ఇస్తూ ప్రపంచ దేశాల ప్రభుత్వాలు మానవ హక్కుల పరిరక్షణకు సమగ్రమైన చట్టాలను విధానాలను సభ్య దేశాల ప్రభుత్వాలకు సూచిస్తూ ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటాడిసెంబర్ 10న ‘విశ్వ వ్యాప్త మానవ హక్కుల ప్రకటన “చేసింది. ప్రపంచంలో ఏదో ఒక రూపంలో మానవ హక్కుల ఉల్లంఘనలు ఎదుర్కొంటూ బానిసత్వంలో మగ్గుతున్న మానవజాతి కి ఈ ప్రకటన గొప్ప వెలుగు అని చెప్పవచ్చు.ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 10వ తేదీని అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటార
ఉన్నత స్థాయి జీవితం మానవ హక్కులు “లాస్కి
“వ్యక్తిలోఅంతర్గతంగా నిభిఢీకృత మైన శక్తి యుక్తులను ఆదారంగా చేసుకొని వ్యక్తులు ఉన్నత స్థాయి లో జీవించడానికి కల్పించబడిన సామాజిక అవకాశాలే మానవ హక్కులు” అని ప్రముఖ ఇంగ్లాండ్ రాజనీతిజ్ఞుడు “జి లాస్కీ” “అని పేర్కొంటూ వ్యక్తుల సర్వతో ముఖాభివృదికి మానవ హకులు పునాది రాళ్ళుగా నిలుస్తాయి అన్నారు.
“మానవ హక్కులు చరిత్ర మాగ్నా కార్ట
మానవహక్కులకుసంబంధించిన చరిత్రను చూస్తే వీటికి పునాది వేసింది క్రీస్తు “శకం 1215 సంవత్సరంలో ఇంగ్లాండ్ రాజు జాన్ జారీ చేసిన “మాగ్నాకార్ట్ట” అని చెప్పవచ్చు దీనిని మొట్ట మొదటి మానవ హక్కుల ప్రకటన గా భావించవచ్చు . న్యాయ బద్దమైన తీర్పు ద్వారా తప్ప మరేవిధమైన పద్ధతుల్లో పౌరుల స్వేచ్ఛను బందీ చేయడం’ బహిష్కరించడం నిషేధం అంటూ మాగ్నాకార్ట స్పష్టం చేసింది. ఇదే అనేక ప్రపంచ విప్లవాలకు నాంది పలికిందని చెప్పవచ్చు.
రక్త రహిత విప్లవం మానవ హక్కులు
1688 లో జరిగిన రక్తరహిత విప్లవం ‘ 1689 లో జారీచేసిన బిల్ ఆఫ్ రైట్స్ రాజకీయ హక్కులకు పునాది వేసింది . క్రీ శ 1776 లో జరిగిన అమెరికా విప్లవం సందర్భంగా థామస్ జెఫెర్సన్ అనే రాజనీతిజ్ఞుడు చేసిన వాఖ్య ” స్వేచ్చా సమానత్వం తో జన్మించిన వ్యక్తి జీవితాంతం వాటిలోనే కొనసాగుతారు అన్న వాఖ్య ప్రపంచ దేశాల రాజ్యంగాలకు ఆదరంగా నిలిచింది.
ప్రజాస్వామ్యం మానవ హక్కులు
20వ శ”1917లో జరిగిన రష్యా విప్లవం ద్వారా వచ్చిన సామాజిక ‘ఆర్థిక ‘రాజకీయ న్యాయమనే అంశాలతో అనేక దేశాలు స్ఫూర్తిని పొందాయి .
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మెజార్టీ దేశాల్లో నియంతృత్వం ‘రాచరిక పాలనా’ వలస పాలన అంతమై స్వతంత్ర ప్రజాస్వామ్య గణతంత్ర దేశాలుగా ఏర్పడ్డాయి’ ఈ మార్పు మానవ హక్కుల ప్రాదాన్యత పెరిగటానికి దోహదపడ్డది.
ఐరాస _దేశాలబృందం
మానవ హక్కుల రూపకల్పనకు ఐ’రా ‘స 9 దేశాల బృధం తో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది.
సంఘం చేసిన ప్రతిపాదనలు
1. మానవులు అందరు సమానమే జాతి ‘వర్ణం ‘కులం మతం’ లింగ విచక్షణ లేకుండ ఎలాంటి రాజకీయ వివక్ష లేని జీవితం గడిపాలి.
2. వెట్టి చాకిరి భానిసత్వం అంటరాని తనం మన్నగు దురాచారాల నుండి రక్షణ పొందడం.
3. విద్యా హక్కు
4. భావ ప్రకటన ‘ స్వాతంత్ర్యం హక్కు
ప్రపంచంలోని అన్ని దేశాల సంస్కృతి ‘నాగరికతలను అంగీకరిస్తూ 30 అధికరణలతో 1948 డిసెంబర్ 10న ప్రపంచ మానవ హక్కుల ప్రకటన చేసింది. ఈ ప్రకటనపై సభ్య దేశాలు సంతకం చేశాయి. ఈ హక్కులను ఉల్లంఘించిన దేశాలపై అంతర్జాతీయ సమాజం ఆంక్షలు విదిస్తుంది. భారత రాజ్యాంగం లో పొందపరిచిన ప్రాథమిక హక్కులను మానవ హక్కుల ప్రకటన కంటే ముందుగానే భారత రాజ్యాంగం లో ని ఆర్టికల్ 19 లో మనము మానవ హక్కులను పొందపరుచు కున్నాము.ఐ ‘రా ‘స హక్కుల కంటే మనము రూపొందించిన మానవ హక్కులు బాగున్నాయని ప్రపంచ దేశాలు ప్రశంసించాయి.
మానవ హక్కులు ప్రాథమిక హక్కులు
మన రాజ్యాంగంలో పేర్కొన్న మానవ హక్కులు భావ ప్రకటన స్వేచ ‘ అసోసియేషన్స్ ఏర్పాటు యూనియన్లు ఏర్పాటు. ఆయుధాలు లేకుండా శాంతి యుత సమావేశాలు జరుపుకోవడం ‘ సహకార సంఘం ఏర్పాటు . దేశ పర్యటన ‘ దేశంలో ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పాటు కు స్వేచ్ఛ ‘వృత్తి స్వేచ్ఛ ‘వ్యాపార’ వర్తక స్వేచ్ఛ కలిగించారు. ఈ హక్కులు ఉన్న ప్రతి పౌరుడు దేశ సార్వమౌమత్వాన్ని దేశ రక్షణ దేశ సమగ్రత విదేశీయులతో సత్సంబంధాలను’ శాంతి ‘భద్రతలు ‘సఖ్యత ‘నైతిక విలువలకు కోర్ట్ వ్యవహారాలకు విఘాతం కలిగించకుండా వ్యవహరించాలి. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల రక్షణ కొరకు గణనీయమైన సేవా చేసినప్పటికీ ప్రపంచంలో కొన్ని దేశాలలో మతం ముసుగులో మానవ హక్కుల రక్షణకు విఘాతం కలుగుతున్న సంఘటనలు సభ్య సమాజానికి సిగ్గు చేటుగా పరిణమించింది.
మానవ హక్కుల రక్షణ భారత్
మానవ హక్కుల విషయంలో మనదేశంలో జరిగిన కొన్ని సంఘటన వల్ల ప్రపంచంలో మనం గర్వంగా తలెత్తుకునేలా చేశాయి. త్రిపుల్ తలాక్ 370 ఆర్టికల్ రద్దు ‘కొన్ని దేవాలయాల్లో స్త్రీలకు ప్రవేశం కల్పించడం. గమనార్హం. మతం మానవ హక్కుల కు అడ్డురాకుడదు. మతం’ కులం ‘స్త్రీ పురుష ‘విచక్షణ లేకుండా మనుషులందరికి మానవ హక్కులు సమానం గా వర్తించాలి.
కామన్ సివిల్ కోడ్ సమాన హక్కులు
ప్రభుత్వం ‘కామన్ సివిల్ కోడ్ ” ప్రవేశ పెట్టి భారతీయులు అందరూ ఒకటే అన్న దాన్ని అమలుకుకృషిచెయ్యాలి .అప్పుడు అందరికీ సమాన హక్కులు లభిస్తాయి. కామన్ సివిల్ కోడ్.వస్తె స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు తో కూడిన మానవ హక్కులు భారతీయు లందరికీ సమానం అనేది ప్రపంచానికి చాటుదాం.మన దేశంలో పేదరికం నిరుద్యోగం’ బాలకార్మికులు ‘ఆకలి చావులు ‘ ఊమెన్ ట్రాఫికింగ్ బానిసత్వము’ వెట్టి చాకిరి ‘కిడ్నాప్ రేప్ ‘కనీస వేతనాలు ‘ ఆర్థిక అసమానతల ‘సామాజిక అసమానతలను’ వలసలు దోపిడీలు ‘మహిళలపై చిన్నారి బాలికలపై అత్యాచారాలు పరువుహత్యలు హత్యలు సర్వ సాధారణమైనాయి.
ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి
గృహ హింస ‘భార్య భర్తల హత్యలు. చిన్న పిల్లల చేత పని చేయించడం.బాలికల మీద అత్యాచారాలు చేసిన వారికిదోషులకు త్వరగా శిక్ష పడేట్లు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చెయ్యాలి. మానవ హక్కుల ఉల్లంఘనలను పౌరసమాజం నిరంతర అప్రమత్తత తో చైతన్య వంతమై పోరాటాలు చేసి మానవ హక్కులను రక్షించుకోవాలి.
రాజకీయ పార్టీలు మానవహక్కుల విభాగం
ప్రతి రాజకీయ పార్టీ మానవ హక్కుల రక్షణ కొరకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి కార్యకర్తలకు ప్రజలకు మానవ హక్కుల రక్షణ తగు జాగ్రత్తలు పట్ల అవగాహన శిక్షణ చైతన్య శిబిరాలు నిర్వహించాలి.
ఉచిత న్యాయ సహాయం మానవ హక్కుల రక్షణ
పోలిష్ ‘రెవెన్యూ’ న్యాయ శాఖ సమన్వయంతో మానవ హక్కుల రక్షణ కోసం ఉచిత న్యాయ సహాయం అందించాలి.మానవ హక్కుల పట్ల అవగాహన సదస్సులు నిర్వహించాలి నూతన విద్యా విధానంలో పాటశాల ‘కళాశాల స్థాయిలో మానవ హక్కులు పాఠ్యంశంగా ప్రవేశ పెట్టాలి.
ఫ్రీ లీగల్ ఎయిడ్స్ క్లినిక్స్ ఏర్పాటు
ఫ్రీ లీగల్ ఎయిడ్ క్లినిక్స్ ఏర్పరిచి పేదలకు ఉచిత న్యాయం అందించి పేదల హక్కుల రక్షణకు కావలసిన సంస్కరణలు పాలనా పరమైన సంస్కరణలు చేపట్టాలి.
మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు
ప్రతి పౌరుడికి స్వేచ్ఛ ‘స్వాతంత్ర తో కూడిన మానవ హక్కులు సమానంగా ఉన్నప్పుడే మానవ హక్కుల లక్ష్యం నెరవేరుతుంది. దేశములోని అన్ని రాష్ట్రాలలో ఏర్పడ్డ మానవ హక్కుల కమిషన్ హక్కుల సంరక్షణ కొరకు చేర్యలు చేపడుతున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘనలను సుమో టో గా తీసుకుంటున్నాయి. 2019 లో తెలంగాణలో ఇంటర్మీడియేట్ ఫలితాల్లో 18 మంది విద్యార్థులు మరణిస్తే వారి ఆత్మహత్య మీద జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. 2002 లో86 వ రాజ్యాంగ సవరణ ద్వారా6 నుండి 14 సంవత్సరాల బాల బాలికల కు నిర్భధ ప్రాథమిక విద్య అందించాలని 21 అధికరణములో పొందపరిచారు.
పత్రికా స్వతంత్రం’ సమాచార హక్కు ‘జీవనోపాధి పొందే హక్కు’నియంతృత్వ చట్టాల నుండి రక్షణ పొందే హక్కులను ప్రాథమిక హక్కుల్లో చేరిచి హక్కుల ఫరిధిని విస్తరించాలన్న 2002 లో నియమించిన రాజ్యాంగ పునర్ సమిక్ష కమిషన్ సూచనలతో హక్కుల ప్రాదాన్యత రోజు రోజుకు పెరుగుతోంది .కరోనా మహమ్మారి విసిరిన పంజా కు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్య వ్యవస్థ కుదేలైంది.
లాక్ డౌన్ వల్ల ప్రజలకు జీవించే హక్కు తో పాటు అనేక హక్కులకు భంగం కలిగింది. అందుకే హక్కుల గురించి అందరికీ తెలియాలి. అనే ఉద్దేశం తో ఐ’రా’స 202o ‘ రికవరీ బెటర్ స్టాండ్అప్ ఫర్ హ్యూమన్ రైట్స్”నినాధాని ప్రకటించింది. మానవ హక్కుల రక్షణ కోసం పాటు పడుతున్న స్వచ్చంధ సంస్థలు పౌరసమాజం మానవుల హక్కులపై అవగాహన చైతన్యం కలిగించి మానవుల సర్వతోముఖాభివృద్ధిలో ప్రభుత్వంతో పాటు ప్రజలు సంపూర్ణ భాగస్వాములు కావాలి ప్రజల నిరంతర అప్రమత్తతే మానవ హక్కుల రక్షణకు శ్రీరామరక్ష.
నేదునూరి కనకయ్య
కరీంనగర్
మొబైల్ : 9440245771





