జి-7 సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోదీ

నేటి నుంచి మూడ్రోజుల పాటు విదేశీ పర్యటన

న్యూదిల్లీ,జూన్‌14: ‌ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం మూడు దేశాల పర్యటనకు వెళ్తున్నారుఈనెల 15-16 తేదీల్లో సైప్రస్‌ ‌లో పర్యటిస్తారు16-17 తేదీల్లో కెనడాలోని జీ7 సదస్సులో పాల్గొంటారు18న క్రొయేషియాలో పర్యటిస్తారుకేంద్ర విదేశాంగ శాఖ శనివారం ఈ వివరాలను వెల్లడించిందిఎంఈఏ వివరాల ప్రకారంసైప్రస్‌ అధ్యక్షుడు నికోస్‌ ‌క్రిస్టోడౌలిడెస్‌ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మోదీ ఈనెల 15-16 తేదీల్లో ఆ దేశంలో అధికారిక పర్యటన జరుపుతారురెండు దశాబ్దాల కాలంలో ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే ప్రథమంఅధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్‌తో చర్చల అనంతరం లిమాసోల్‌లో వ్యాపార దిగ్గజాలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారురెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతకు మోదీ పర్యటన దోహదం కానుంది

అనంతరం కెనడాకు మోదీ బయలుదేరి వెళ్తారుకెనడా ప్రధాని మార్క్ ‌కార్నే ఆహ్వానం మేరకు జూన్‌ 16-17 ‌తేదీల్లో జరిగే జీ7 సదస్సులో మోదీ పాల్గొంటారుజీ7 సదస్సులో మోదీ పాల్గొనడం వరుసగా ఇది ఆరోసారిసదస్సు సందర్భంగా పలు దైపాక్షిక సమావేశాల్లోనూ ప్రధాని పాల్గొంటారుప్రధాని తన పర్యటన చివర్లో క్రొయేషియాలో పర్యటిస్తారుక్రొయేషియా ప్రధాని ఆండ్రెజ్‌ ‌ప్లెంకోవిక్‌ ఆహ్వానం మేరకు జూన్‌ 18‌న ఆ దేశంలో అధికారిక పర్యటన జరుపుతారుక్రొయేషియాలో భారతదేశ ప్రధానమంత్రి ఒకరు పర్యటించనుండటం ఇదే మొదటిసారిద్వైపాక్షిక సంబంధాల్లో ప్రధాని పర్యటన ఒక మైలురాయి కానుందిప్రధాని ప్లెంకోవిక్‌అధ్యక్షుడు జోరన్‌ ‌మిలనోవిక్‌తో మోదీ సమావేశమవుతారుయూరోపియన్‌ ‌యూనియన్‌ ‌భాగస్వాములతో మరింత పటిష్ట బంధాల గురించి చర్చిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *