అడ్లూరిపై పొన్నం వ్యాఖ్య‌ల దుమారం

~ ఉప ఎన్నిక వేళ ఇద్ద‌రు మంత్రుల మ‌ధ్య వివాదం
– పరస్పర విమర్శలతో వేడెక్కిన రాజకీయం
– సమన్వయంతో కలసి ముందుకు వెళ్లాలన్న పీసీసీ చీఫ్‌
-‌ అ‌గ్రనేతలను కలిసి ఫిర్యాదు చేస్తానన్న ల‌క్ష్మ‌ణ్‌

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7: ‌జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, ‌మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రి పొన్నం వ్యాఖ్యలపై తాజాగా, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌స్పందిస్తూ.. ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన పొరపాటును ఒప్పుకొని క్షమాపణ చెబితే పొన్నంకు గౌరవంగా ఉంటుందన్నారు. మాదిగలు అంటే కు అంత చిన్న చూపా, అని సీరియస్‌ అయ్యారు. అన్న మాటను సమర్ధించుకుని ఇప్పటి వరకు రియాక్ట్ ‌కాకుండా ఉన్నావంటే ఈ విషయం నీ విజ్ఞతకే వొదిలేస్తున్నాను అని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు. సహచర మంత్రిని, ఎస్సీ సామాజిక వర్గం నేతను ఆ మాట అంటుంటే చూస్తూ ఉంటావా అని మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామిని మంత్రి లక్ష్మణ్‌ ‌కుమార్‌ ‌నిలదీశారు. ఇక, మంత్రి పొన్నం ప్రభాకర్‌- అడ్లూరి లక్ష్మణ్‌ ‌కుమార్‌ ఎపిసోడ్‌ ‌పై పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌ ‌రంగ ప్రవేశం చేశారు. ఇద్దరు మంత్రులకు ఫోన్‌ ‌చేసి ఇరువురు సంయమనం పాటించాలని చెప్పినట్లు సమాచారం. అడ్లూరినీ ఉద్దేశించి పొన్నం కామెంట్స్ ‌చేశారని ప్రచారం.. అడ్లూరిని ఉద్దేశించి మాట్లాడలేదని పొన్నం వివరణ ఇచ్చారు. పొన్నం కామెంట్స్‌ని తప్పు పట్టిన మంత్రి శ్రీధర్‌ ‌బాబు.. పార్టీకి, ప్రభుత్వానికి ఇది మంచిది కాదంటూ శ్రీధర్‌ ‌బాబు హితవు పలికారు.  మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌ ‌మనస్పర్థలపై పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌గౌడ్‌ ‌స్పందించారు. ఈ మేరకు డియం సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఆదేశాలతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు మహేష్‌ ‌గౌడ్‌ ‌ఫోన్‌ ‌చేశారు. ఇద్దరు సమన్వయంతో కలిసి పని చేసుకోవాలని మహేష్‌ ‌గౌడ్‌ ‌సూచించారు. పొన్నం ప్రభాకర్‌ ‌లాగా అహంకారంగా మాట్లాడటం తనకురాదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌తెలిపారు. మంత్రి వివేక్‌ ‌లాగా తన దగ్గర డబ్బులు లేవని స్పష్టం చేశారు. తాను మంత్రి కావడం, ఆ సామాజిక వర్గంలో పుట్టడం తన తప్పా.. అని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో సోనియా, రాహుల్‌, ‌ఖర్గే, నాక్షిని కలుస్తానని వివరించారు. తాను కుర్చీలో కూర్చుంటే వివేక్‌ ‌లేచి వెళ్లిపోతున్నారని చెప్పారు. తాను పక్కన ఉంటే వివేక్‌ ఓర్చుకోవడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం తాను ఆదిలాబాద్‌ ‌పర్యటనలో ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్‌కు వచ్చిన వెంటనే కాంగ్రెస్‌ ‌నేతలను కలుస్తానని అడ్లూరి లక్ష్మణ్‌ ‌స్పష్టం చేశారు.  తాను మాదిగ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టే మంత్రి పదవి వొచ్చిందని  అడ్లూరి లక్ష్మణ్‌ అన్నారు. నేను మంత్రి కావడం.. మా సామాజికవర్గంలో పుట్టడం తప్పా? అని ప్రశ్నించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో విభేదాల నేపథ్యంలో ఆయన స్పందించారు. అయితే  మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌వ్యాఖ్యలపై తాను స్పందించనని మంత్రి పొన్నం పేర్కొన్నారు. అడ్లూరి లక్ష్మణ్‌తో విభేదాల నేపథ్యంలో ఆయన స్పందించారు. పీసీసీ అధ్యక్షుడు నాతో మాట్లాడారు.. అదే ఫైనల్‌. ‌రహ్మత్‌నగర్‌ ‌భేటీలో ఏం జరిగిందో ఆయనకు వివరించా. అడ్లూరి వ్యాఖ్యలపై నేను స్పందించను. పార్టీ పరంగా మహేష్‌ ‌గౌడ్‌ ఆదేశాలు శిరోధార్యం అని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *