ఫార్ములా రేస్ కేసు భయంతోనే దిల్లీకి కేటీఆర్ ప‌రుగులు

 కేటీఆర్ పై మంత్రి పొంగులేటి మ‌రోసారి సంచ‌న‌ల వ్యాఖ్య‌లు

ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్ 11 : ఫార్ములా ఈ-రేసింగ్ కేసుకు భ‌య‌ప‌డి కేటీఆర్ దిల్లీకి ప‌రుగులు పెట్టార‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచ‌లన కామెంట్స్ చేశారు. ఖమ్మం జిల్లా చిన్నవెంకటగిరిలో సోమవారం మంత్రి పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఎక్కడున్నారు? ఎందుకు దిల్లీకి వెళ్లారు? ఎవరి కాళ్లు మొక్కి ఏం లబ్ధి పొందుదామని వెళ్లారు? లిక్కర్ స్కాం కేసులో కేంద్రం పెద్దలను ఒప్పించి తన చెల్లి బెయిల్ పొందినట్లుగానే తనను తాను కాపాడుకునేందుకు మళ్లీ దిల్లీ వెళ్లారా ఫార్ములా అని మంత్రి పొంగులేటి ప్ర‌శ్నించారు. ఈరేసింగ్ నిర్వహణకు విదేశాల్లోని సంస్థలకు 55కోట్లను ఏవిధంగా మళ్లించార‌ని కేబినేట్ అప్రువల్ ముఖ్యమంత్రి అప్రువల్ లేకుండా కేటీఆర్ విదేశాల్లోని తొత్తు సంస్థలకు నిధులు మళ్లించార‌ని ఆరోపించారు. ఫార్ములా – ఈరేసింగ్ నిర్వహణలో నిధుల దుర్వినియోగం అంశంపై విచారణను రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీకి అప్పగించింద‌ని, – ఫార్ములా – ఈరేసింగ్ నిర్వహణకు సంబంధించిన కంపెనీతో ఎంవోయూ కుదుర్చుకోకమునుపే కేటీఆర్ నిధులను మళ్లించార‌న్నారు. ఎవరి అనుమతి తీసుకోకుండా ఎవరికోసం 55 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మళ్లించారన్నారరు. ప్రజాప్రతినిధిని అదుపులోకి తీసుకుని విచారించాలంటే దర్యాప్తు సంస్థలకు గవర్నర్ అనుమతి ఉండాలని ముందస్తుగా ఏసీబీ అనుమతి కోరింద‌ని తెలిపారు. రేపో మాపో గవర్నర్ అనుమతి వొస్తుందని ముందే గ్రహించిన కేటీఆర్ హైదరాబాద్ నుంచి దిల్లీకి తన బేస్ మార్చార‌ని చెప్పారు. అంబానీ, అదానీ, ఆర్ఎస్స్ఎస్, బీజేపీ పెద్దలను కలిసి తనను ఫార్ములా -ఈరేసింగ్ కేసు నుంచి తప్పించాలని ప్రాధేయపపడేందుకే వెళ్లారని ఎద్దేవా చేశారు. నేను పేల్చబోయే బాంబేంటో కేటీఆర్ కు తెలుసని, గత ప్రభుత్వం పదేళ్ల హయాంలో చేసిన అవినీతి బాగోతాన్ని వెలికి తీస్తే భూమి మీద నుంచి అంతరిక్షంకు వెళ్లి దాక్కునేలా ఉన్నారని అన్నారు. కేంద్రపట్ఝణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసి తనపై కేసుకాకుండా చూడాలని కేటీఆర్ ప్రాధేయపడుతున్నారన్నారు

కేంద్రపట్టణ అభివృద్ధి శాఖమంత్రితో నీకు పనేంటి కేటీఆర్..? ఈ రెస్ కార్ల పందెంలో జరిగిన అవినీతిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు రెస్పాన్స్ రాలేదు.. కేంద్రమంత్రులను ప్రాధేయపడి కేసులు వెనక్కి తీసుకోవడానికి దిల్లీకి వెళ్లారా..? కవిత లిక్కర్ స్కాంలో ఎవరి ప్రమేయంతో బెయిల్ పొందారో అదే రీతీలో దిల్లీలో ఎవరిని కలిసారో మాదగ్గర ఆధారాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *