బస్సు దుర్ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి

– మృతుల కుటుంబాలకు కేంద్రం తరపున రూ.2 లక్షలు

న్యూదిల్లీ, నవంబర్‌ 3: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగ్రాతులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు.

తీవ్రంగా కలచివేసింది : కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి
చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఇలాంటి ఘ‌ట‌నలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలి: రామచందర్‌ రావు 

అలాగే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు సంతాప ప్రకటించారు. చేవెళ్ల సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం అత్యంత విషాదకరమన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టానికి కారణమైన తీరు మనస్సును కలచివేస్తోందన్నారు. బాధిత కుటుంబ సభ్యులు మనోధైర్యంతో నిలవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని, అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. రోడ్డు భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేయాలని, ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ని దేవుని ప్రార్థిస్తున్నాను.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *