– దశల వారీగా హ్యామ్ రోడ్ల నిర్మాణం
– ఆర్ అండ్ బి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: హ్యామ్ విధానంలో పెద్ద ఎత్తున రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఉన్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. దీనిపై శుక్రవారం జరిగే క్యాబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకోనున్నామన్నారు. వచ్చే 30 నెలల్లో నాణ్యమైన రోడ్లు అంటే తెలంగాణ వైపు చూస్తారని, దేశంలోనే ద బెస్ట్ రోడ్స్ ఇన్ తెలంగాణ అనే చర్చ జరుగుతుందని అన్నారు. రోడ్లు భవనాలు శాఖపై ఎర్రమంజిల్ ఆర్‌అండ్‌బి ప్రధాన కార్యాలయంలో మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. హ్యామ్ రోడ్లు, టిమ్స్ హాస్పిటల్స్, పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రోడ్ల విషయంలో నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందే టిమ్స్ హాస్పిటల్స్ పనుల్లో వేగం పెంచి అతి త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదన్నారు. సమావేశంలో ఆర్‌అండ్‌బి ఈఎన్సీలు మోహన్ నాయక్, జయభారతి, సిఈలు రాజేశ్వర్ రెడ్డి, బి.వి.రావు, కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





