హెచ్‌ఐబీ బాధితులకు ప్రభుత్వం ‘చేయూత’

కొత్తగా 14,084 మందికి పెన్షన్‌ మంజూరు
ఫైల్‌పై మంత్రి సీతక్క సంతకం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: హెచ్‌ఐవీ బాధితులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం మరోసారి మానవీయంగా స్పందించింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కొత్తగా 14,084 మంది హెచ్‌ఐవీ బాధితులకు చేయూత పథకం కింద పెన్షన్లు మంజూరు చేస్తూ ఫైల్‌పై సోమవారం సంతకం చేశారు. ఈ పెన్షనను జూలై నెల నుంచి లబ్ధిదారులు అందుకోనున్నారు. పేదరికంలోని హెచ్‌ఐవీ బాధితులు పూర్తిస్థాయిలో పనిచేయలేని స్థితిలో ఉండటంతోపాటు, వారిపై నెలనెలా అధిక వైద్య ఖర్చులు కూడా పడుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 34,421 మందికి నెలకు రూ.2016 చొప్పున పెన్షన్‌ అందుతోంది. 2022 ఆగస్టు తరువాత హెచ్‌ఐబీ కేటగిరీలో కొత్తగా పెన్షన్లు మంజూరవలేదు. తాజాగా రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ఆధ్వర్యంలో కొత్తగా నమోదైన 14,084 మందికి అర్హతలు నిర్ధారించిన అనంతరం ’సెర్ప్‌’ ద్వారా పెన్షన్లు మంజూరయ్యాయి.

జిల్లాల వారీగా అర్హుల సంఖ్య

హైదరాబాద్‌-3,019, నల్గొండ-1,388, ఖమ్మం-954, సూర్యాపేట-931, కరీంనగర్‌-833, ఆదిలాబాద్‌-482, భద్రాద్రి కొత్తగూడెం-556, హన్మకొండ-825, జగిత్యాల-306, జనగాం-228, కామారెడ్డి-702, మహబూబ్‌నగర్‌-452, నిజామాబాద్‌-528, పెద్దపల్లి-567, సంగారెడ్డి-1242, సిద్దిపేట-527, వికారాబాద్‌-544. జయశంకర్‌ భూపాలపల్లి, గద్వాల్‌, మంచిర్యాల, మెదక్‌, ములుగు, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, నిర్మల్‌, రంగారెడ్డి తదితర జిల్లాల్లో కొత్తగా ఒక్కరు కూడా నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *