21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

న్యూదిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈనెల 21 నుంచి జరగనున్నాయి. సమావేశాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు బుధవారం తెలిపారు. ఆగస్టు 21 వరకు సమావేశాలు జరుగుతాయని, స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా ఆగస్టు 13, 14 తేదీల్లో సమావేశాలు జరగవన్నారు. కాగా, ఈ సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకూ ఉంటాయని ఇంతకుముందు ప్రకటించారు. అయితే తాజాగా ఆగస్టు 21 వరకూ నిర్వహించేందుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్టు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో కిరణ్‌ రిజిజు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *