– 2022 నుంచి నేటివరకు రూ.303 కోట్లు పెండింగ్
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: పెండిరగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసి, మైనారిటీ విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిలు రూ.303 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. ప్రజాభవన్‌లో బుధవారం ఆర్థిక శాఖ ఆర్థిక శాఖాధికారులతో నిర్వహించిన సమావేశంలో 2022 నుంచి పెండిరగ్‌లో ఉన్న ఈ స్కాలర్‌షిప్ మొత్తాన్ని ఒకేసారి క్లియర్ చేయాలని ఆదేశించారు. ఆర్థిక స్థోమత లేకపోయినప్పటికీ విదేశాల్లో ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు సాధించి ఆర్థికంగా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆలోచనతో వేలాదిమంది పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌పై విదేశాలకు వెళ్లారు. గత ప్రభుత్వ కాలం నుంచి ఈ స్కాలర్‌షిప్ అందకపోవడంతో విదేశాల్లో ఉన్న విద్యార్థులు, రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు అమెరికా, యూకే వంటి దేశంలో కొత్తకొత్త ఆంక్షలతో విద్యార్థులపై మానసిక ఒత్తిడి తీవ్రమైంది. ఆయా దేశాల్లో గతంలో మాదిరి చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి లేదు. దాంతో రోజురోజుకూ ఆర్థిక భారం పెరిగిపోతోంది. మరోవైపు బ్యాంకుల్లో తీసుకున్న విద్యా రుణాల భారం కూడా పెరుగుతోంది. ఈ పరిస్థితులన్నిటినీ అవగాహన చేసుకున్న డిప్యూటీ సీఎం భట్టి ఈ సమస్యను ప్రాధాన్యతాంశంగా భావించి స్కాలర్‌షిప్ మొత్తాన్ని 2228మంది లబ్ధిదారులకు ఒకేసారి క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో వేలాది కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురించాయి. కష్టకాలంలో ప్రభుత్వం ప్రతి విద్యార్థికి సుమారు రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించడంతో తమ బిడ్డలు లక్ష్యాన్ని చేరుకుంటారని, తమ ఇబ్బందులు తొలగిపోతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి, దేశానికి తిరిగి అర్థవంతమైన సేవలందించే అవకాశం కలుగుతుందని ఆశాభావంతో ఉన్నట్టు ఓవర్‌సీస్ విద్యార్థులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





