– వేలాదిమందికి ఉద్యోగాలు కల్పిస్తున్న సీఎం
– విజన్ వున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
– సోషల్ వెల్ఫేర్ శాఖ మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్
– కొత్త ఏఎస్‌డబ్ల్యూఓలకు నియామక పత్రాలు
హైదరాబాద్, అక్టోబర్ 21: బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ఏకైక లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని, ఆయన అవలంబిస్తున్న ఫ్రెండ్లీ గవర్నమెంట్ పరిపాలనకనుగుణంగా ఉద్యోగులు పని చేయాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. గ్రూప్ 2 పోటీ పరీక్షల్లో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారులుగా నియమితులైన అభ్యర్థులకు సెక్రటేరియట్ లోని ఎస్సీ డెవలప్మెంట్ శాఖ మంత్రి కార్యాలయంలో మంగళవారం నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టాక వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని, ముఖ్యమంత్రి విజన్ ఉన్న నాయకుడని తదనుగుణంగా అధికారులు పనిచేయాలని గ్రామీణ ప్రాంతాలలో చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంక్షేమ కోసం క్రమశిక్షణతో పనిచేసే మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ మంత్రి లక్ష్మణ్ కుమార్ చొరవ తో గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కీం (బిఏఎస్) పథకానికి సంబంధించిన 25 శాతం నిధులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఇప్పించారని అభినందించారు. హాస్టల్ విద్యార్థులకు 40% చార్జీలను 200 శాతం కాస్మోటిక్ చార్జీలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని, సహకరించిన మల్లు భట్టి విక్రమార్కకు, మంత్రి లక్ష్మణ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. మానకొండూర్ ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ ఏఎస్ డబ్ల్యుఓ అధికారులకు అభినందనలు తెలిపారు. ఎస్సీడిడి సెక్రెటరీ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి మాట్లాడుతూ ఏఎస్ డబ్ల్యుఓలుగా నియమితులైన వారందరూ వృత్తి రీత్యా సామర్థ్యాలను పెంపొందించుకోవాలని, హాస్టల్ విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలని, ఇంతటితో ఆగకుండా గ్రూపు 1 అధికారులుగా రాణించేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ, ఎస్సిడిడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్యసాచి గోష్ తదితరులు హాజరయ్యారు. నూతనంగా నియమితులైన గ్రూప్ 2 అధికారులు మంత్రికి శాలువా కప్పి ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.
|
|




