లూటిఫికేషన్‌ తప్ప నోటిఫికేషన్‌ లేదు

– ఒక్క ఛాన్స్‌ ఇస్తేనే రాష్ట్రాన్ని రేవంత్‌ రెడ్డి నాశనం చేశారు
– మల్లొకసారి ప్రజలు కాంగ్రెస్‌కు, రేవంత్‌కు అవకాశం ఇవ్వరు
– బుల్డోజర్లు రావద్దనుకుంటే బీఆర్‌ఎస్‌కు ఓటు వేయండి: కేటీఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: ఒక్క ఛాన్స్‌ అంటూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక్క చాన్స్‌ ఇచ్చినందుకే.. నెంబర్‌ వన్‌గా ఉన్న తెలంగాణ చివరి ప్లేస్‌కు పడిపోయిందని అన్నారు. రేవంత్‌ రెడ్డికి ఒక్క ఛాన్స్‌ ఇచ్చినందుకే 160 మందికిపైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్‌ ఇస్తేనే హైదరాబాద్‌ను భ్రష్టుపట్టించి రియల్‌ ఎస్టేట్‌ను కూడా నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లీ ఏ ముఖం పెట్టుకొని ఒక్క ఛాన్స్‌ అడుగుతున్నారని నిలదీశారు. ఇలాగే ఒక్క ఛాన్స్‌ అంటూ కంటోన్మెంట్‌ నియోజకవర్గలో గెలిచి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, మరోసారి జూబ్లీహిల్స్‌ ప్రజలను మోసం చేసేందుకే రేవంత్‌ రెడ్డి మరొక్క ఛాన్స్‌ అంటూ అడుక్కుంటున్నారని, కానీ జూబ్లీహిల్స్‌ ప్రజలు మరొక చాన్స్‌ ఇవ్వరని కేటీఆర్‌ అన్నారు. హింస, అరాచకత్వంతో రెచ్చిపోతున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాల్సిన టైమ్‌ వచ్చిందన్నారు. ఇక్కడ ఎవరైనా బెదిరింపులకు దిగితే బాధితులకు అండగా ఉండి.. రౌడీల సంగతి తేలుస్తామని ఆయన హెచ్చరించారు. తమను మోసం చేసిన కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేసుకున్న నిరుద్యోగ అభ్యర్థులపై దాడులు చేయడం దారుణమన్నారు. దిల్లీికి పంపేందుకు డబ్బులున్నాయి కానీ పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు డబ్బులు లేవా అని ప్రశ్నించారు. బుల్డోజర్ల పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం అరాచకం సృష్టిస్తోందన్నారు. ఈరోజు కూకట్పల్లి, కుత్బుల్లాపూర్‌, హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల్లో వచ్చిన హైడ్రా బుల్లోజర్లు రేపు జూబ్లీహిల్స్‌కు రావద్దు అనుకుంటే కారు గుర్తుపై ఓటు వేసి మాగంటి సునీతను గెలిపించాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ హయాంలో ఒక్క హైదరాబాద్‌లోనే లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టిస్తే రేవంత్‌ సర్కార్‌ మాత్రం వేలాది ఇండ్లు కూలగొట్టి ప్రజలను రోడ్డుపైకి లాగిందని మండిపడ్డారు. కారు, బుల్డోజర్‌కు మధ్య జరుగుతున్న ఈ ఎన్నికలో బుల్జోడర్‌ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *