చేవెళ్ల మాజీ శాసనసభ్యులు, ఎన్ఎస్ఎస్ వార్తా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కొండా లక్ష్మారెడ్డి (84) అనారోగ్యం తో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మనుమడైన లక్ష్మారెడ్డి గతంలో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గ్రీవెన్స్ సెల్ అధికార ప్రతినిధిగా పలు హోదాల్లో పని చేశారు .1999, 2014 లో రెండు పర్యాయాలు లక్ష్మారెడ్డి హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ కూడా చేసారు . జర్నలిజం వృత్తి పట్ల గల ఆసక్తి, నిబద్ధత కారణంగా 1980లో ఆయన న్యూస్ అండ్ సర్వీసెస్ సిండికేట్ (ఎన్ఎస్ఎస్) అనే ఒక వార్తా సంస్థ ప్రారంభించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా, జర్నలిస్టుల సహకార గృహ నిర్మాణ సంఘం అధ్యక్షులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా జర్నలిస్టులకు లక్ష్మారెడ్డి సేవలందించారు.
ఎన్ఎస్ఎస్ లక్ష్మా రెడ్డి ఇక లేరు





