*బీఆర్ఎస్ బలోపేతానికి కార్యాచరణ
*ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తాం
*మా పార్టీలో అందరం కేసీఆర్ గారి కోసమే పని చేస్తున్నాము
*మంచిర్యాల జిల్లాలో మీడియాతో సంభాషణ కార్యక్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. టి. రామారావు 2027లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలోని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన పాల్గొని పలు రాజకీయ, సంస్థాగత అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. నియోజకవర్గాల డిలిమిటేషన్ వల్ల రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు పెరుగుతాయని, దీనివల్ల బీఆర్ఎస్‌కు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వొస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్ పైన ఇప్పుడు ఉన్న సమాన రేషియో లో విభజన జరిగితే ఎలాంటి అభ్యంతరాలు అవసరం లేదు. పార్లమెంట్ లో ప్రస్తుతం 24% ఎంపీల స్థానాల్లో వాటా ఉన్నది. అదే శాతం తగ్గకుండా డీలిమిటేషన్ జరిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందరికీ 50 శాతం సీట్ల పెంపు జరిగితే నష్టం లేదు. ఈ అంశంలో అభ్యంతరం ఎందుకు అర్థం కావడం లేదు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, బీఆర్ఎస్ ఎప్పటిలాగే ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు పెట్టుకోమని, పొత్తులు తమకు కలిసిరావని స్పష్టం చేశారు. అలాగే ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తూ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నట్లు తెలిపారు





