నీతి ఆయోగ్‌ డెల్టా ర్యాంకింగ్‌ విడుదల 

దేశవ్యాప్తంగా గట్టు బ్లాక్‌కు 5వ స్థానం
జోన్‌-3లో 2వ స్థానం 
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: నీతి ఆయోగ్‌ తాజాగా విడుదల చేసిన ఆస్పిరేషనల్‌ బ్లాక్‌ ప్రోగ్రామ్‌ (ఏబీపీ) 2024-25 (జనవరి-మార్చి 2025) డెల్టా ర్యాంకింగ్‌లో గట్టు బ్లాక్‌ దేశవ్యాప్తంగా 500బ్లాక్‌లలో 5వ స్థానం, జోన్‌ 3లో 2వ స్థానం (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కలిపిన జోన్‌) సాధించిందని జిల్లా కలెక్టర్‌ బి.ఎం.సంతోష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రగతికి గుర్తింపుగా త్వరలో నీతి ఆయోగ్‌ తరఫున గట్టు బ్లాక్‌కు రూ.కోటి పురస్కారం అందజేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్‌ ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైన ‘వాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ లో టాప్‌ ర్యాంక్‌ సాధించిన బ్లాక్‌ల విజయ గాథలు ప్రదర్శిస్తారన్నారు. ఇది ఆస్పిరేషనల్‌ బ్లాక్స్‌, డిస్ట్రిక్ట్‌ ప్రోగ్రామ్‌లు దేశాన్ని వికసిత భారత్‌ 2047 లక్ష్యం వైపు నడిపించేందుకు ఎలా పనిచేస్తున్నాయో చూపిస్తుందన్నారు. ఈ ర్యాంకింగ్‌ను 5 ప్రధాన అంశాలకుగాను ఉన్న 39 కీలక పనితీరు సూచికలు (%ఖూIం%) ఆధారంగా నిర్ణయించబడిరది. 1.ఆరోగ్యం, పోషణ, 2 విద్య, 3.వ్యవసాయం, అనుబంధ సేవలు, 4.ప్రాథమిక మౌలిక సదుపాయాలు, 5.సామాజిక అభివృద్ధి 2024 అక్టోబర్‌-డిసెంబరు త్రైమాసికం నుండి 2025 జనవరి-మార్చి త్రైమాసికం మధ్యలో గట్టు బ్లాక్‌ కాంపోజిట్‌ స్కోర్‌ 61.24 నుండి 69.43కు పెరిగి, 8.19% అభివృద్ధిని నమోదు చేసింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ బి.ఎం.సంతోష్‌ గట్టు మండల అధికారులు, విభాగాధిపతులు, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లను అభినందిస్తూ ఇది అందరి సమిష్టి కృషి ఫలితంగా సాధ్యమైందని, 100% కేపీఐ లక్ష్య సాధనకు అందరూ అంకితభావంతో పని చేస్తున్నారని కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *