కొత్త సంవత్సరం రోజే అబద్దాలతో షురూ

– హరీష్‌, ‌కెటిఆర్‌పై ఎంపి చామల మండిపాటు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 1: నూతన సంవత్సరం తొలి రోజునే కేటీఆర్‌ ‌గోబెల్స్ ‌ప్రచారాన్ని మొదలు పెట్టారని  బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ఎం‌పీ చామల కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. ఓవైపు హరీష్‌ ‌రావు.. మరోవైపు కేటీఆర్‌ ‌కలిసి కాంగ్రెస ప్రభుత్వం, ప్రజా పాలనపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్‌ ‌రావు.. కృష్ణా, గోదావరి నదీ జలాలు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని.. కేటీఆర్‌ ‌వచ్చి రైతులకు యూరియా సరఫరాపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై వాస్తవాలు మాట్లాడాలని.. తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ‌పార్టీని తెలంగాణ ప్రజలు భూస్థాపితం చేశారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అవయవదానం చేసి బీజేపీని 8 సీట్లలో గెలిపించి గుండు సున్నా తెచ్చుకుందని ఎద్దేవా చేశారు ఎంపీ చామల. రైతులకు యూరియా కోసం ధర్నాలు చేశామని.. కేంద్ర మంత్రి నడ్డాతో మాట్లాడి యూరియా తెప్పించామన్నారు ఎంపీ చామల. 2024-2025 సంవత్సరానికి వానాకాలం పంటకు 9.66 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల యూరియాను తెలంగాణ రాష్ట్రానికి తెప్పించామన్నారు. యాసంగికి 10.41 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల యూరియాను తీసుకువచ్చామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ‌పదేళ్ల పాలనలో ఈ స్థాయిలో ఎప్పుడూ యూరియా తేలేదన్నారు. 2025-2026 వానాకాలం పంటకు 9.79 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల యూరియా తెచ్చామని.. యూరియాను తీసుకురావడంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఎక్కడా ఫెయిల్‌ ‌కాలేదన్నారు ఎంపీ. లెక్కలు ప్రజలు తెలుసుకోలేరని కేటీఆర్‌ ‌జనవరి 1వ తేదీ నుంచే అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేటీఆర్‌ ‌తప్పుడు సమాచారంతో, తప్పుడు మాటలతో తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టొద్దన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *