మెదక్‌కు చెందిన తల్లీకూతుళ్ల దుర్మరణం

– క‌ర్నూలు జిల్లా బ‌స్సు ప్ర‌మాదంలో..

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌24: ‌కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో తెలంగాణలోని మెదక్‌ ‌జిల్లాకు చెందిన తల్లీకుమార్తె కూడా మృతిచెందారు. మృతులను శివ్వాయిపల్లికి చెందిన సంధ్యారాణి (43), చందన (23)గా పోలీసులు వెల్లడించారు. కుమార్తె చందనను బెంగళూరులో డ్రాప్‌ ‌చేసేందుకు సంధ్యారాణి వేమూరి కావేరి బస్సు ఎక్కింది. బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ‌కంపెనీలో చందన ఉద్యోగం చేస్తోంది. సంధ్యారాణి.. తన భర్త ఆనంద్‌కుమార్‌తో కలిసి మస్కట్‌లో ఉంటున్నారు. బెంగళూరులో సాప్ట్‌వేర్‌ ఇం‌జినీర్‌గా కుమార్తె చందన జాబ్‌ ‌చేస్తున్నారు. అయితే పెళ్లి వేడుక కోసం సంధ్యారాణి దంపతులు గ్రామానికి వచ్చారు. బిజినెస్‌ ‌దృష్ట్యా ఆనంద్‌కుమార్‌ ‌వారం రోజుల క్రితం తిరిగి మస్కట్‌ ‌వెళ్లిపోయారు. సంధ్యారాణి వెళ్లాల్సి ఉండగా.. ఆమెకు జ్వరం వచ్చింది. జ్వరం తగ్గాకా వెళదామని ఆమె నిర్ణయించుకుని తన ప్రయాణాన్ని ఆపేశారు. కుమార్తెను బెంగళూరులో విడిచిపెట్టి మస్కట్‌ ‌వెళ్లాలనుకున్నారు. ఈ క్రమంలో బస్సులో వెళ్తుండగా ఊహించని ప్రమాదం ఎదురైంది.

బస్సులోంచి దూకి బతికిన సుబ్రమణ్యం

ప్రాణాలు కాపాడుకున్న బిక్కవోలు గంగాధర్‌ ‌రెడ్డి

బస్సు ప్రమాదం నుంచి కాకినాడకు చెందిన సుబ్రహ్మణ్యం సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం కర్నూలులోని హాస్పిటల్‌లో ఆయన చికిత్స పొందుతున్నాడు. ‘బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగ కమ్మేయడంతో గందరగోళం ఏర్పడింది. చీకట్లో ఏదీ సరిగ్గా కనబడలేదన్నారు. వెనుక వైపు అద్దం నుంచి అతికష్టం ద దూకాం’ అని సుబ్రహ్మణం తెలిపారు. ఇకపోతే ప్రమాదంలో కోనసీమ జిల్లా రావులపాలెంకు చెందిన శ్రీనివాసరెడ్డి (39) మృతి చెందాడు. ఊబలంకకు చెందిన శ్రీనివాస్‌ ‌రెడ్డి క్రేన్‌ ‌బిజినెస్‌లు ఉన్నాయి. అతని పక్కనే కూర్చున్న యూపికి చెందిన పంకజ్‌ ‌కూడా మృతి చెందాడని భావిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుక చెందిన మల్లిడి గంగాధర్‌ ‌రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు.

కావేరీ యాజమాన్యంతో పాటు డ్రైవర్‌పై కేసు

బస్సు దహన ఘటనకు సంబంధించి కావేరీ ట్రావెల్స్ ‌బస్సు యాజమాన్యం, డ్రైవర్‌ ‌ముత్యాల లక్ష్మయ్యలపై కర్నూలు జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ బస్సులో ప్రయాణించిన ప్రయాణికుడు రమేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు పెట్టారు. ఇప్పటికే ఆ బస్సుకి చెందిన ఒక డ్రైవర్‌ ‌శివ నారాయణ పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే, పరారీలో మరో డ్రైవర్‌ ‌ముత్యాల లక్ష్మయ్య ఉన్నారు. ముత్యాల లక్ష్మయ్యపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికుల మృతికి కారణమయ్యారని కావేరి బస్సు యాజమాన్యం, డ్రైవర్‌ ‌ముత్యాల లక్ష్మయ్యలపై పోలీసులు కేసులు పెట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా డీఐజీ కోయ ప్రవీణ్‌ ‌సీన్‌ ‌రీ క••స్ట్రక్షన్‌ ‌చేసి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు.  బస్సు ప్రమాద ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదాన్ని నింపింది. హైదరాబాద్‌ ‌నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు చిన్నటేకూరు వద్ద మంటల్లో కాలిపోయింది. బైక్‌ ‌ఢీకొనడంతో మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు, ఒక బైకర్‌ ‌మృతిచెందారు. ఈ ప్రమాదంలో మొత్తం 11 మందికి గాయాలయ్యాయి. క్షతగ్రాతులకి కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు.

ప్రమాద ఘటపై సమగ్ర విచారణ :మంత్రి పొన్నం  ప్రభాకర్‌ ‌

హైదరాబాద్‌: ‌కర్నూలు బస్సు ప్రమాదంపై సమగ్ర విచారణ చేస్తున్నామని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. హైదరాబాద్‌ ‌నుంచి బస్సు బయలుదేరిన నేపథ్యంలో.. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. అవసరమైన సహాయక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేటు బస్సుల వేగ నియంత్రణకు చర్యలు చేపడతామని తెలిపారు. ఈ ఘటనపట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
పొగ కమ్ముకోవడంతో స్పృహ కోల్పోయి ఉంటారు
తరవాత మంట్లలో కాలి బూడిదయ్యారు
ఫోరెన్సిక్‌ ‌నిపుణుడు అలీఖాన్‌ ‌విశ్లేషణ

హైదరాబాద్‌: ‌కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన తీరును ఫోరెన్సిక్‌ ‌నిపుణుడు అలీఖాన్‌ ‌విశ్లేషించి పలు వివరాలు వెల్లడించారు. బైక్‌ ‌బస్సు కిందకు దూసుకెళ్లడం వల్ల బైక్‌ ‌నుంచి లీక్‌ అయిన పెట్రోల్‌తో మంటలు చెలరేగి ఉంటాయన్నారు. అయితే బస్సులోని కార్గో అంటుకోవడం వల్లే మంటలు ఎక్కువగా వ్యాపించి ఉండొచ్చని తెలిపారు. బస్సులో చోటు తక్కువగా ఉండటం వల్ల ప్రయాణికులు బయటకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉండదన్నారు. పాలీయూరీతిన్‌ ‌ఫోమ్‌ ‌కాలడం వల్ల విషపూరిత పొగ వ్యాపించి ప్రయాణికులు స్ప•హ కోల్పోవచ్చన్నారు. అందువల్ల చాలా మంది ప్రయాణికులు అక్కడే అగ్నికి ఆహుతై ఉంటారని అలీఖాన్‌ ‌విశ్లేషించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *