మరింత పారదర్శకంగా వోటరు జాబితా

జనన, మరణ ధ్రువీకరణ రికార్డులతో వోటరు కార్డు అనుసంధానం
కొత్త డిజైన్ లో వోటరు సమాచార స్లిప్‌ లు ‌
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

న్యూదిల్లీ, మే 1 : వోటర్ల జాబితాను నవీకరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. వోటర్ల జాబితాను జనన, మరణ ధ్రువీకరణ రికార్డులతో అనుసంధానం చేయనున్నట్లు ఈసీ గురువారం ప్రకటించింది. వోటర్ల జాబితాలో పవిత్రతను నిర్థారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు

తెలిపింది. భారత రిజిస్ట్రార్‌ ‌జనరల్‌ ‌నుండి ఎలక్టాన్రిక్‌గా ఎప్పటికప్పుడు మరణ నమోదు డేటాను సేకరించి, వోటర్ల జాబితాను నవీకరిస్తామని వెల్లడించింది. ఎలక్టోరల్‌ ‌రిజిస్ట్రేషన్‌ అధికారులు మరణాల గురించి సకాలంలో సమాచారం అందుకుంటారని, మరణించిన వారి బంధువుల నుంచి అభ్యర్థన వొచ్చే వరకు వేచి చూడకుండా బూత్‌స్థాయి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి సమాచారాన్ని ధృవీకరించడానికి వీలు కలుగుతుందని పేర్కొంది. 1960 వోటర్ల నమోదు నిబంధనలు, 1969 జనన మరణాల నమోదు చట్టం ప్రకారం ఇటువంటివి సేకరించే అధికారం ఇసికి ఉంది. వోటరు సమాచార స్లిప్‌ ‌లను వోటర్లకు నచ్చేలా మార్చేందుకు కొత్త డిజైన్‌లను రూపొందించాలని కూడా నిర్ణయించినట్లు తెలిపింది.
వోటర్‌ ‌సీరియల్‌ ‌నెంబర్‌, ‌పార్ట్ ‌నెంబర్‌లను మరింత స్పష్టంగా కనిపించేలా ఫాంట్‌ ‌సైజ్‌ను పెంచనున్నామని, దీంతో వోటర్లు తమ పోలింగ్‌ ‌స్టేషన్‌ను సులభంగా గుర్తించవచ్చని, పోలింగ్‌ అధికారులు వోటర్ల జాబితాలో వారి పేర్లను సమర్థవంతంగా గుర్తించవచ్చని పేర్కొంది. ఎన్నికల నిబంధనలు 1960, జనన, మరణాల నమోదు చట్టం 1969 ప్రకారం ఎన్నికల సంఘానికి ఈ సమాచారాన్ని తీసుకునే అధికారం ఉంది. వోటరు సమాచార చీటీ మరింత స్పష్టంగా కనిపించేందుకు వీలుగా దాని డిజైన్‌ను మార్చాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. సీరియల్‌ ‌నంబర్‌, ‌పార్టు నంబర్ల సైజును పెంచనున్నట్లు తెలిపింది. తద్వారా వోటర్లు తమ పోలింగ్‌ ‌స్టేషన్లను తేలికగా గుర్తించడంతోపాటు అటు పోలింగ్‌ అధికారులకు కూడా జాబితాలోని పేర్లను సులభంగా సరిచూసుకునే వీలుంటుంది. దీంతోపాటు బూత్‌ ‌స్థాయి అధికారులకు కూడా ఫొటో ఐడీ కార్డులను జారీ చేయనున్నట్లు ఈసీ వెల్లడించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *