మాన్‌సూన్‌ రెగట్టాలో యువ సెయిలర్లకు బహుమతులు

అందజేసిన గురుకుల పాఠశాలల కార్యదర్శి సైదులు, జాయింట్‌ సెక్రటరీ తిరుపతి

 

ఖైరతాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14 : ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 16వ మాన్‌సూన్‌ రెగట్టాలో ఐదో రోజు పోటీలు నిలిచిపోయాయి. దీంతో ప్రస్తుతం లీడర్‌ బోర్డులో అగ్రస్థానంలో ఉన్న సెయిలర్లు తమ స్థానాలను నిలుపుకునే అవకాశం ఉంది. 12 రేసుల సిరీస్‌లో ఇంకా నాలుగు రేసులు మిగిలి ఉన్నాయి. వాతావరణం మెరుగుపడపోతే ప్రస్తుత పోడియం స్థానాల్లో ఉన్నవారే విజేతలుగా నిలిచే అవకాశం ఉంది. ఇది అగ్రశ్రేణి క్రీడాకారులకు ఆనందాన్ని కలిగిస్తుండగా, వెనుకబడిన వారు నిరాశ చెందారు. నాన్‌-ర్యాంకింగ్‌ విభాగాలలో యువ సెయిలర్లకు ప్రోత్సాహకంగా బహుమతి ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. ఆసియా క్రీడల ప్రతిభ అన్వేషణలో భాగంగా రెండు నెలలుగా యాచ్‌ క్లబ్‌లో శిక్షణ పొందుతున్న రాష్ట్రంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువ సెయిలర్లకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శి బి.సైదులు, జాయింట్‌ సెక్రటరీ జి.తిరుపతి బహుమతులు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *