మెట్రో రెండో దశపై ఎంపీలకు అవగాహన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: మెట్రో రైల్‌ రెండో దశ సాధనకు రాష్ట్ర ఎంపీలకు పార్క్‌ హయత్‌ హోటల్‌లో రాష్ట్ర ప్రభుత్వం, మెట్రో రైల్‌ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ముఖ్య అతిథిగా హాజరెయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీలు మల్లు రవి, కిరణ్‌కుమార్‌ రెడ్డి, రఘువీర్‌ రెడ్డి, రఘురామరెడ్డి, పోరిక బలరాం నాయక్‌, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, సురేష్‌ సెట్కర్‌, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, రఘునందన్‌ రావు తదితరులు హాజరయ్యారు. మెట్రో రైల్‌ ఎండి రెడ్డి మెట్రో రెండో దశ గురించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *