రోగికి మరో జన్మనిచ్చిన మెడికవర్‌ వైద్యులు

వరంగల్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10: ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని నుండి వరంగల్‌ మెడికవర్‌ హాస్పిటల్‌ వైద్య బృందం కాపాడిరది. ఈమేరకు హాస్పిటల్‌ సెంటర్‌ హెడ్‌ నమ్రత శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. రాజారావు (51) అనే వ్యక్తి గుండె సంబంధిత తీవ్రమైన సమస్యలతో వరంగల్‌ మెడికవర్‌ హాస్పిటల్‌కు ప్రాణాపాయ స్థితిలో వ‌చ్చార‌న్నారు. దీర్ఘకాలంగా ధూమ పానం అలవాటున్న ఆయన గుండె వేగంగా కొట్టుకోవడం, మూర్ఛ వంటి లక్షణాలతో ఇతర హాస్పిటల్స్‌కు వెళ్ళగా ఈసిజిలో మోనోమార్ఫిక్‌ వెంట్రిక్యులర్‌ టాకీ కార్డియా ఉన్నట్లు తేలిందన్నారు. రోగిని మెడికవర్‌ హాస్పిటల్‌కి తీసుకొచ్చేసరికి పల్స్‌ 220 బిపిఎం, రక్తపోటు 60 సిస్టాలిక్‌గా నమోదైందని, రోగి కార్డియోజెనిక్‌ షాక్‌లో ఉన్నాడని ఆమె చెప్పారు. వెంటనే కన్సల్టెంట్‌ సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ సంతోష్‌ మొదాని, కన్సల్టెంట్‌ క్రిటికల్‌ కేర్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ లక్ష్మీదీపక్‌, కన్సల్టెంట్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌ డాక్టర్‌ సుష్మ ప్రియాంక నేతృత్వంలోని వైద్య బృందం సింక్రొనైజ్డ్‌ డిసి కార్డియోవర్షన్‌ చేసి రోగి గుండెను సాధారణస్థాయికి (సైనస్‌ రిధమ్‌) తీసుకొచ్చారని నమ్రత వివరించారు. ఈకో టెస్ట్‌లో గుండె విస్తరించి ఉండటం, ఎడమ వెంట్రికిల్‌ పనితీరు తీవ్రంగా తగ్గిపోవడం (ఈఎఫ్‌-20%) గుర్తించారు. కొరోనరీ యాంజియోగ్రఫీలో మాత్రం రక్త నాళాలు సాధారణంగా ఉన్నట్లు తేలిందన్నారు. సరైన చికిత్సతో రోగి షాక్‌, కిడ్నీ సమస్య నుండి పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు రోగికి ఎఐసిడి (ఆటోమేటిక్‌ ఇంప్లాంటేబుల్‌ కార్డియోవర్టర్‌ డీఫిబ్రిలేటర్‌) ఏర్పాటు చేయాలని వైద్యులు సూచించారు. డాక్టర్‌ సంతోష్‌ మొదాని మాట్లాడుతూ కార్డియాక్‌ అరిత్మియా అనేది సడెన్‌ కార్డియాక్‌ అరెస్టుకు ప్రధాన కారణాలలో ఒకటని, ప్రారంభ దశలో గుర్తించి తగిన చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌ హాస్పిటల్‌ సెంటర్‌ మార్కెటింగ్‌ హెడ్‌ హరినాథ్‌ గుప్తా, రోగి రాజారావు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *