– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
వనపర్తి ప్రజాతంత్ర డిసెంబర్ 1 తెలంగాణను అభివృద్ధిలో దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా ఆత్మకూరు పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రూ.15 కోట్ల వ్యయంతో ఆత్మకూరు నగర అభివృద్ధి పనులకు, రూ.15 కోట్లతో అమరచింత నగర అభివృద్ధి పనులు, ఆత్మకూరు మున్సిపాలిటీలో రూ.22 కోట్ల వ్యయంతో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటరు భవన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పి. జె.పి క్యాంపు ఆవరణలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, జిల్లా అటవీ శాఖ అధికారి కె.అరవింద్ ప్రసాద్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి, దేవరకద్ర, వనపర్తి, గద్వాల శాసన సభ్యులు జి.మధుసూదన్ రెడ్డి, తూడి మేఘారెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, గద్వాల మాజీ జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య, వనపర్తి జిల్లా ఎస్పీ డి. సునీత, ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ శశిధర్, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




