మహారాష్ట్ర-తెలంగాణ మధ్య బలమైన బంధం

– మంత్రి జూపల్లితో మహారాష్ట్ర మంత్రి అశిష్‌ భేటీ

హైదరాబాద్‌, అక్టోబర్‌ 31: మహారాష్ట్ర ఐటీ, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఆశిష్‌ షెలార్‌ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మరాఠా మిలటరీ ల్యాండ్‌ స్కేప్స్‌ ఆఫ్‌ ఇండియా కాఫీ టేబుల్‌ బుక్‌ను మంత్రి జూపల్లికి అందజేశారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక సహకారం – మార్పిడి, పర్యాటక అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. మహరాష్ట్ర- తెలంగాణ అనాదిగా సాంస్కృతిక కేంద్రాలుగా గుర్తింపు పొందాయని, రెండిరటి మధ్య బలమైన అనుబంధం ఉందని, సంస్కృతిలోని వైవిధ్యాన్ని పరస్పరం పంచుకునే దిశగా రెండు రాష్ట్రాలు కలసి ముందుకు సాగాలని ఇరువురూ అకాంక్షించారు. సాంస్కృతిక పునరుజ్జీవనం, సాంస్కృతిక సలహా మండలి ద్వారా సామాజిక రుగ్మతలపై ప్రజల్లో చైతన్యం, బతుకమ్మ వేడుకల్లో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు, నూతన పర్యాటక విధానం, తదితన అంశాలను మంత్రి జూపల్లి ఆయనకు వివరించారు. యాసలు, కళారూపాలను, వేడుకలను ప్రస్తావిస్తూ, వైవిధ్యాన్ని తన ప్రత్యేకతగా చూపే రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *