జీవిత చట్టం

ఏదీ తెలియకుండా జరిగే దానిలో
అదే సంతోషం, సంబరం.
అన్నీ తెలిసి జరిగే పద్ధతిలో
ప్రతీది ఆలోచన, భయం.

జీవితచట్టమొకటి రహస్యంగా
వయసును కొన్నాళ్ళు,
మనసుని మరికొన్నాళ్లు
నిక్కచ్చిగా అమలుచేసే అనివార్యంలో

నవ్వులు సరదాగా ఖర్చవుతాయి
ఊరే కన్నీటీ బొట్టు ఓ పాఠం.
మనిషి ప్రశ్నాపత్రంగా ప్రశ్నలన్నీ సహేతుకాలే.
నిడివి, క్రమశిక్షణలు అనుభవాలు.
– చందలూరి నారాయణరావు
       9704437247 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *