ఇనుము సాగి సాగి
బలహీనమైనట్లు
ఎలాస్టిక్ సాగి సాగి
సాగేగుణాన్ని కోల్పోయినట్లు
కొన్నిబంధాలు
బలహీనమై దూరమౌతాయి
చెల్లాచెదురు అవుతాయి
వారి వారి వ్యక్తిగ
కారకారాణాల కారకాల వల్ల
లోహ ప్లాస్టిక్ లా జీవిత సంబంధాలు…
పేదైన దొరైన మధ్యతరగతి వారైన
చిన్న పెద్దకుటుంబమైన
ఆర్థిక సంబంధాలే పునాదులు
అహంకార దోరణులే బాటలు
డబ్బు అహం ఉత్పేరకాలు
మనుష్యులపై మనసుపై
గాఢప్రభావం చూపుతాయి…
పెళ్ళీలు చెడిపోతాయి
హత్యలు కోర్టు కేసులు
ఆత్మహత్యలు అలుగుడులు…
మానసిక స్థితి అస్థిరస్థితి
కృంగతీసే జీవస్థితి
కుడితిలో పడ్డ ఎలుక స్థితి
స్థిరస్థితి కోసం
మౌనం ఓ మార్గం
యోగ ఓ వ్యాయామం
సమతుల్యత ఆహారం
సద్గుణ సంపన్న జీవనం
మన్నన భావన వ్యవహారం
మణి హారభూషణం
సాటిమనిషి అనే భావన తనలో
నీటిలో నీటిబిందువు లామమేకం కావాల
అంతటా శాంతి శీతల శీకరాలే కురుస్తాయి
-రేడియమ్, 9291527757
ధవళకేతన రెపరెపలు
