హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22: కుమ్రం భీమ్ ఇచ్చిన జల్, జంగల్, జమీన్ నినాదమే స్ఫూర్తిగా బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ నేతృత్వంలో పాలన అందించామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. వారి ఆశయాల సాధన దిశగా పయనించామని తెలిపారు. ఆదివాసీ యోధుడు, తిరుగుబాటు వీరుడు.. గోండు బెబ్బులి కుమ్రం (కొమురం) భీమ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఆయన ఘన నివాళులర్పించారు. ఎస్టీ గురుకులాలు, కాలేజీల సంఖ్య పెంచడం, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ అందించడం, సీఎంఎస్టీఈఐ స్కీం ద్వారా గిరిజన బిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం.. కుమ్రం భీమ్ స్ఫూర్తిగా ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. కేసీఆర్ హయాంలో ఆసిఫాబాద్ జిల్లాకు కుమ్రం భీమ్ పేరు పెట్టుకున్నందుకు, జోడేఘాట్‌లో సుందరమైన స్మృతి వనాన్ని ఏర్పాటు చేసినందుకు, హైదరాబాద్ మహానగరంలో కుమ్రం భీమ్ పేరిట ఆదివాసీ భవనాన్ని నిర్మించినందుకు గర్విస్తున్నామన్నారు. అస్తిత్వ పోరాటాలకు ప్రతీకగా నిలిచిన కుమ్రం భీమ్‌కు జోహార్లు అర్పించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


